కస్తూర్బాల్లో ఇంటర్‌ విద్య

0
2


కస్తూర్బాల్లో ఇంటర్‌ విద్య

 అందుబాటులోకి ఆంగ్ల మాధ్యమం

ఉభయ జిల్లాల్లో 156 ఖాళీ సీట్లు
న్యూస్‌టుడే, సదాశివనగర్‌

ఉభయ జిల్లాల్లోని నిజామాబాద్‌, జక్రాన్‌పల్లి, మాక్లూర్‌, భీమ్‌గల్‌, గాంధారి, దోమకొండ విద్యాలయాల్లో ఈ ఏడాది ఇంటర్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి వచ్చింది. ప్రతి కళాశాలలో 80 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూప్‌లు ఉన్నాయి. నిజామాబాద్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం ఆరు కళాశాలల్లో 156 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు కేజీబీవీల్లో పదో తరగతి చదువుకున్న తర్వాత ఇంటర్‌ విద్యను కొనసాగించేందుకు పలువురు బాలికలు ఇబ్బంది పడేవారు. ఇకపై ఆ పరిస్థితి లేదు. ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒకేచోట అందుబాటులో ఉంటోంది. ప్రభుత్వం ఉచిత విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తోంది. గతేడాది ఆర్మూర్‌, బోధన్‌, డిచ్‌పల్లి, బాల్కొండ, భిక్కనూరు, బీర్కూర్‌, లింగంపేట, బాన్సువాడ, జుక్కల్‌ కేజీబీవీల్లో తెలుగు మాధ్యమంలో ఇంటర్‌ విద్యను తీసుకొచ్చారు. ఈ తరుణంలో ప్రతి కళాశాలలో 80 సీట్ల చొప్పున తొమ్మిదింట్లో 720 మంది బాలికలకు ఇంటర్‌ చదువుకొనే వెసులుబాటు లభించింది. పేద బాలికల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కస్తూర్బాలు ఉన్నతీకరణను పెంపొందించుకొంటున్నాయి. ఒకప్పుడు పాఠశాల చదువులకే పరిమితమైన వీటిల్లో సర్కారు ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తెచ్చింది. గతేడాది తెలుగు మాధ్యమంలో కొనసాగిన ఈ విద్య ఈసారి ఆంగ్ల మాధ్యమంలోనూ అందుతోంది. ఈ నేపథ్యంలో బడి బయట ఉన్న, అనాథ బాలికల ఉన్నత చదువులకు మార్గం మరింత సుగమమైంది.

ఇబ్బందులు తొలగిపోయాయి – కల్యాణి, విద్యార్థిని
కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్య అందిస్తుండటం వల్ల పేద విద్యార్థుల ఇబ్బందులు తొలగిపోయాయి. చాలా మంది బాలికలు పదోతరగతి పూర్తి కాగానే చదువు మానేసేవారు. ఈసారి ఆంగ్లమాధ్యమం తీసుకురావడం శుభపరిణామం.

సద్వినియోగం చేసుకోవాలి
– శిల్ప, ప్రత్యేకాధికారి, గాంధారి  

కేజీబీవీ జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. వీటిలో అర్హత ఉన్న బాలికలు ప్రవేశాలు పొంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here