కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌: యాషెస్‌లో ఐసీసీ ప్రవేశపెట్టే కొత్త నిబంధన

0
5


హైదరాబాద్: ఆగస్టు 1న ఆరంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్‌లో కాంకషన్‌(బలమైన దెబ్బతో సృహ తప్పడం) సబ్‌స్టిట్యూట్‌కు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ వారంలో లండన్‌ వేదికగా జరగనున్న క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వార్షిక సభ్య సమావేశ అజెండాలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

2014లో ఫిలిప్ హ్యూస్ మరణాంతరం ఐసీసీ ముందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. 2017 నుంచీ ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ టోర్నీలతో పాటు బీబీసీ 2016-17 సీజన్‌లో సైతం సబ్‌స్టిట్యూట్‌ఆటగాళ్లు బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయోగాత్మక పద్ధతిలో ఐసీసీ అనుమతి ఇచ్చింది.

'టెస్టు చాంపియన్‌ షిప్‌'లో

‘టెస్టు చాంపియన్‌ షిప్‌’లో

ఐసీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘టెస్టు చాంపియన్‌ షిప్‌’లో సైతం ఈ విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి జరిగే యాషెస్‌ సిరీస్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను అమలు చేయాలని భావిస్తోంది. దీనికోసం రూపొందించాల్సిన నియమ నిబంధనలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌‌కు సంబంధించి

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌‌కు సంబంధించి

ఈ మధ్య కాలంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌‌కు సంబంధించి నియమ నిబంధనలను రూపొందించాలంటూ చాలా మంది తమ గొంతుకను వినిపించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పిన దాని ప్రకారం డాక్టర్ అనుమతితోనే ఆటగాడు మైదానాన్ని వీడాల్సి ఉంటుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో సైతం ఐసీసీ దీనిపై క్రికెటర్లకు అవగాహన కల్పించింది.

కాంకషన్‌(బలమైన దెబ్బతో సృహ తప్పడం) సబ్‌స్టిట్యూట్‌ విషయానికి వస్తే...

కాంకషన్‌(బలమైన దెబ్బతో సృహ తప్పడం) సబ్‌స్టిట్యూట్‌ విషయానికి వస్తే…

మైదానంలో ఆటగాడి తలను బంతి బలంగా తాకితే దిమ్మ తిరుగుతుంది. దీంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాదు. దీనినే కాంకషన్‌ అంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడికి కేవలం ఫీల్డింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసేందుకు ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవడం లేదు.

బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం

బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశం

అయితే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్రకారం మరొక ఆటగాడిని జట్టులోకి అనుమతినిస్తారు. దీంతో ఆ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా తలకు బలంగా తగలడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అదే కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ అమల్లో ఉండే అతడి స్థానంలో మరొక ఆటగాడు క్రీజులోకి వచ్చేవాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here