కాంగ్రెస్‌ పార్టీ ధర్నా

0
3


కాంగ్రెస్‌ పార్టీ ధర్నా

నిజామాబాద్‌(కలెక్టరేట్‌): రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ధర్నా నిర్వహించింది. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఒకేసారి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కావలసినన్ని నిధులు కేటాయించలేదని విమర్శించారు. జిల్లాలో పండించే పసుపు, ఎర్రజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వాటికి కావాల్సిన మద్దతు ధర ప్రభుత్వం కల్పించాలని, నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ధర్నా అనంతరం వీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ఈ.అనిల్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here