కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో

0
1


కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో

నిజామాబాద్: బోధన్ లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. బోధన్ పట్టణం మొత్తం రహదారులన్నీ గుంతల మయం అవ్వడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు రైల్వే గేట్ వద్ద రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. అధికారులకు, ఎమ్మెల్యే కు వినతిపత్రాలు ఇచ్చినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ప్రజలు గుంతల రోడ్లతో ప్రమాదాలకు గురి అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్లను తొందరగా బాగు చేయకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తామని అన్నారు. పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here