కాంస్యంతో సరి: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ముగిసిన సాయిప్రణీత్ పోరాటం

0
0


హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ సాయి ప్రణీత్‌ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో వరల్డ్‌ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) చేతిలో 13-21,8-21 తేడాతో చిత్తుగా ఓడిపోయాడు.

బీసీసీఐ సైతం!: ఆంటిగ్వా టెస్టులో నలుపు రంగు బ్యాడ్జిలతో టీమిండియా

ఇద్దరి మధ్య తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో తొలి గేమ్‌లో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమానంగా నిలిచారు. ఆ తర్వాత మొమోటా తన అనుభవంతో అద్భుత ప్రదర్శన చేసి 13-21తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, రెండో గేమ్‌లోనూ మొమోటా తనజోరుని కొనసాగించి మ్యాచ్‌ని సొంతం చేసుకున్నాడు.

దీంతో సాయి ప్రణీత కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత మాజీ దిగ్గజ షట్లర్ ప్రకాశ్‌ పదుకొనే సరసన చేరాడు. 1983లో ప్రకాశ్‌ పదుకొనె ఈ మెగా ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు పతకం అందించి ప్లేయర్‌గా సాయిప్రణీత్‌ చరిత్ర సృష్టించాడు.

స్వర్ణానికి అడుగు దూరంలో: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పీవీ సింధు

మరోవైపు భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనా క్రీడాకారిణి చెన్‌ యు ఫీతో జరిగిన మ్యాచ్‌లో 21-7, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది.

ఫలితంగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. కేవలం 39 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ప్రత్యర్ధిని చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు నాలుగు పతకాలు గెలిచిన సింధు… స్వర్ణం మాత్రం నెగ్గలేదు. అయితే, ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకాన్ని గెలవాలి ఉవ్విళ్లూరుతోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here