కాజల్ సినిమాకు 25 సెన్సార్ కట్‌లు.. అంతలా రెచ్చిపోయిందా!

0
1


కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘పారిస్ పారిస్’. షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది. నిజం చెప్పాలంటే కొన్ని నెలలు గడిచింది. కానీ, ఇంకా విడుదలకు మాత్రం నోచుకోలేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘క్వీన్’కు ఇది రీమేక్. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను కాజల్ పోషించారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాను తెలుగు, మలయాళం, కన్నడలో కూడా తెరకెక్కించారు. తెలుగులో తమన్నా, మలయాళంలో మంజిమా మోహన్, కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే, ‘పారిస్ పారిస్’ చిత్రాన్ని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల చిత్రాన్ని సెన్సార్ బోర్డు సభ్యులకు చూపించారు. సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు షాకయ్యారట. అడల్ట్ కంటెంట్‌ను ఈ సినిమాలో బాగా చొప్పించారని సమాచారం. యు/ఎ సర్టిఫికెట్ కావాలంటే 25 కట్‌లు వేయాల్సి ఉంటుందని సభ్యులు నిర్మాతకు సూచించారని తెలిసింది. ఒకవేల కట్స్ ఏమీ లేకుండా ఈ సినిమాను విడుదల చేయాలంటే ‘ఎ’ సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేశారట.

Also Read:

వైరల్ వీడియో: వామ్మో సమంత.. ఏంటా ఫిట్‌నెస్.. జరజరా పాకేస్తోంది!

వైరల్ వీడియో: వామ్మో సమంత.. ఏంటా ఫిట్‌నెస్.. జరజరా పాకేస్తోంది!

వాస్తవానికి టీజర్‌లోనే కాజల్ అందరికీ షాక్ ఇచ్చింది. టీజర్‌లో ఒక చోట కాజల్ వక్షోజంపై మరో అమ్మాయి చేయివేసే సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం చూసి అందరూ షాకయ్యారు. ఈ సన్నివేశాన్ని తీసేయాలని, లేదంటే మార్చాలని సెన్సార్ బోర్డు దర్మక నిర్మాతలకు సూచించిందని సమాచారం. అయితే, కట్స్ విషయంలో కాజల్ అగర్వాల్ సెన్సార్ బోర్డుపై కాస్త అసహనంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు ఈ కట్‌ల పేరుతో మరింత ఆలస్యం చేస్తున్నారని కాజల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తుందని తాను ఆశిస్తున్నానని కాజల్ చెప్పారు.

ఇదిలా ఉంటే, కట్స్ లేకుండా సినిమాను విడుదల చేయడానికి సినిమా కాపీని సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి నిర్మాత పంపారట. మరి వారు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారో చూడాలి. కాగా, తెలుగులో ఈ సినిమాకు ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే టీజర్ కూడా విడుదలైంది. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. జగపతిబాబు, సంజయ్‌ స్వరూప్‌, సిద్ధు జొన్నలగడ్డ, జీవీఎల్‌ నరసింహరావు, మాస్టర్‌ సంపత్‌ ఇతరపాత్రల్లో నటించారు. బాలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది సంగీతం అందించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here