కాజ్‌వేపై గుంతల పూడ్చివేత

0
6


కాజ్‌వేపై గుంతల పూడ్చివేత

కాజ్‌వే గుంతలపై కంకర వేసి చదను చేయిస్తున్న నాయకులు

ఎల్లారెడ్డి, న్యూస్‌టుడే: ఎల్లారెడ్డి పెద్ద చెరువు కాజ్‌వేపై గుంతలు పడి ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఈనాడులో ప్రచురితమైన ‘కాజ్‌వేపై గుంతలు పూడ్చరూ’ కథనానికి ఎమ్మెల్యే సురేందర్‌, తెరాస నాయకులు స్పందించారు. శనివారం సబ్ధల్‌పూర్‌ అలుగుపై కంకర పొడితో గుంతలు పూడ్చివేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ అధికారులు చేయాల్సిన పనులను ఎమ్మెల్యే చొరవతో చేసినట్లు నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్‌, సంతోష్‌, సాయిబాబా తెలిపారు. గుంతల్లో ఇరుక్కుపోయిన ఆటోలను సైతం బయటకు తీసేందుకు శ్రమించారు.

ఇరుక్కున్న ఆటోను నెట్టుతూ..



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here