కాడిమోసిన చేతులు.. కాణిపై నగుమోములు

0
2


కాడిమోసిన చేతులు.. కాణిపై నగుమోములు

స్వాపూర్‌ గ్రామానికి చెందిన భార్యాభర్తలు నామ్‌దేవ్‌, అనిత దుర్భర పేదరికం అనుభవిస్తున్నారు. కాడెడ్లు లేకపోవడంతో తమ భుజాలపైనే గుంటుక వేసుకుని కలుపు తీయసాగారు. వారి దయనీయ స్థితిని ‘ఈనాడు’ తన కెమెరాలో బంధించి ప్రచురించింది. వాటిని చూసి స్పందించిన దాతలు వారికి రెండు కాడెడ్లు అందించారు. ప్రభుత్వం పవల్‌ టిల్లర్‌ ఇచ్చింది.

- ఏడాది క్రితం నాటి సంఘటన ఇది.

కాడెద్దులే ప్రస్తుతం వారి జీవనాధారమయ్యాయి. బుధవారం వాటిపై కాణి వేసి దుండెపై తన కొడుకును రాజులా కూర్చోబెట్టి నవ్వుతూ చేనుకు తీసుకెళ్లసాగారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు తన చరవాణిలో ఈ దృశ్యాన్ని బంధించి ‘న్యూస్‌టుడే’కు పంపారు.

- న్యూస్‌టుడే, జుక్కల్‌

ప్రధానాంశాలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here