కామారెడ్డి గ్రంథాలయం దేశంలోనే ఆదర్శం

0
0


కామారెడ్డి గ్రంథాలయం దేశంలోనే ఆదర్శం

రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీధర్‌

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌, పక్కన రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీధర్‌ తదితరులు

లింగంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో 33 జిల్లాల్లో కామారెడ్డి జిల్లా గ్రంథాలయం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌ శ్రీధర్‌ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో నూతన డిజిటల్‌ గ్రంథాలయ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి గ్రంథాలయానికి పేరు రావడానికి కారణం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ సంపత్‌గౌడ్‌ అని, అనతి కాలంలోనే అభివృద్ధి పథంలోకి గ్రంథాలయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలో రామారెడ్డి, గాంధారి మండలాలకు నూతన కేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరుకానున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ గుడితో సమానం గ్రంథాలయం అని, పోటీ ప్రపంచంలో నిరుద్యోగులకు ఇవి ఎంతో ఉపయోగపడుతాయన్నారు. కామారెడ్డి గ్రంథాలయాన్ని డిజిటల్‌ చేసి పాఠకులకు వసతులు కల్పించడంతో ఈ ఏడాది 214 కొలువులు సాధించినట్లు చెప్పారు. లింగంపేట సర్పంచి లావణ్య గ్రంథాలయం శిస్తు రూ.లక్ష చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సంపత్‌గౌడ్‌, ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, సర్పంచి లావణ్య, వైస్‌ ఎంపీపీ విఠల్‌రెడ్డి, తెరాస మండలాధ్యక్షుడు సిధ్దిరాంరెడ్డి, మాజీ జడ్పీటీసీలు సంజీవ్‌రెడ్డి, తానాజీరావు, రాజేశ్వర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here