కామ్రేడ్‌ లింగన్న సంతాప సభ పోస్టర్‌ ఆవిష్కరణ

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్‌ లింగన్నను కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని రోళ్ళపాడు వద్ద బూటకపు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపి జీవించే హక్కును కేసీఆర్‌ ప్రభుత్వం హరించిందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టియు) నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. ఆదివారం జక్రాన్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. కామ్రేడ్‌ లింగన్న ఆదివాసుల సమస్యలపై, పోడు భూములు ప్రజలకే దక్కాలని నిరంతరం పోరాడి, ప్రజల హదయాల్లో నిలిచిన ముద్దుబిడ్డ అని ఆయన కొనియాడారు. కామ్రేడ్‌ లింగన్న చిన్నతనములోనే అన్నల పార్టీ పట్ల ఆకర్షించబడి జీవితం అంటే ప్రజలని, ప్రాణం అంటే పార్టీ అని భావించి నిర్బంధాన్ని ఎదిరించి పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచిన లింగన్నను అతికిరాతకంగా కేసీఆర్‌ ప్రభుత్వం కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దాసు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యహింస ఉండదని, ప్రజాస్వామిక హక్కులు పరిరక్షించబడుతాయని, గొంతు చించుకుని మాట్లాడిన కేసీఆర్‌ నేడు ప్రజా ఉద్యమ కారులను అణిచి వేయుటకు కుట్రలు కుతంత్రాలు చేస్తూ, మరో దిక్కు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం చేస్తున్నాడని ఆయన అన్నారు. ఏడు దశాబ్దాల కాలంలో పాలకులు వివిధ పార్టీల పేరుతో అధికారం చెలాయించినా పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన అన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here