కారు రుణ బదిలీలో కష్ఠాలున్నాయ్?

0
2


కారు రుణ బదిలీలో కష్ఠాలున్నాయ్?

ఈ రోజుల్లో కార్లు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్థలు రుణ సదుపాయం కల్పిస్తున్న నేపథ్యంలో చాలా మంది కార్లను ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొంత మంది రుణాన్ని తిరిగి చెల్లించే కాలపరిమితి మిగిలి ఉండగానే ఆ కారును విక్రయించాలనుకుంటారు. ఇలాంటప్పుడు కొందరు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించి తమ కారును విక్రయిస్తుంటారు.

మరికొందరు మాత్రం రుణాన్ని చెల్లించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఆ కారును కొనుగోలు చేసే వారికి రుణాన్ని బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియే అయినా అసాధ్యం ఏమీ కాదు. కారు రుణాన్ని బదిలీ చేసే సమయంలో దానికి సంబంధించిన యాజమాన్య హక్కును కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రుణాన్ని బదిలీ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు మీరే భరించాల్సి ఉంటుంది. తప్పదు అనుకుంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే..

రుణ ఒప్పంద వివరాలు పరిశీలించండి

మీ రుణాన్ని మరొకరికి బదిలీ చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి మీ ప్రస్తుత రుణ డాక్యుమెంట్లను పరిశీలించండి. మీ రుణాన్ని మరొకరికి బదిలీ చేసే అవకాశం ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకుంటే మీరు రుణం తీసుకున్న రుణదాతను సంప్రదించి రుణ బదిలీ అవకాశం ఉందో లేదో చెక్ చేసుకోండి. రుణాన్ని బదిలీ చేయాలనుకుంటున్న విషయాన్నీ తెలియజేయండి.

ఇక మీ రుణాన్ని తీసుకునే వ్యక్తికీ సంభందించిన క్రెడిట్ చరిత్ర బాగుండాలి. వారికి స్థిర ఆదాయం ఉండాలి, ఆదాయాన్ని ధృవీకరించే ప్రూఫ్ లు ఉండాలి. నివాసానికి సంబందించినా ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండాలి. వీటన్నింటిని పరిశీలనతోపాటు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం, రుణ గ్రహీత చరిత్రను చూసిన తర్వాతనే బ్యాంకు రుణ మంజూరికీ ముందుకు వస్తుంది.

ఆర్ సి బదిలీ

ప్రస్తుత కారు యజమాని రుణంతో పాటె వాహనానికి సంభందించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సి ) ని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆర్ సి బదిలీకోసం ఆర్టీవో వద్ద కొన్ని చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

బీమా పాలసీ బదిలీ

కారును కొనుగోలు చేసే వారి పేరుమీదకు మీ మోటార్ ఇన్సూరెన్సుని బదిలీ చేయాల్సి ఉంటుంది. మీ కారు రిజిస్ట్రేషన్, రుణ బదిలీ జరిగిన తర్వాత వాటికి సంబంధించి పత్రాలను బీమా కంపెనీకి సమర్పించాలి. బీమా సంస్థ అనుమతి పొందిన తర్వాత మీ కారు కొనుగోలు చేసిన వారి పేరు మీదకు పాలసీ బదిలీ అవుతుంది.

రుణ బదిలీ కోరే వారు ఏమివ్వాలంటే..

రుణ బదిలీ కోరే కొత్త కస్టమర్ తన పేరు మీదకు రుణాన్ని బదిలీ చేయమంటూ ఒక ఫామ్ సమర్పించాలి. గుర్తింపు ధ్రువీకరణ పత్రం, ఆదాయ, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. బ్యాంకులు అవసరమైన మరిన్ని పాత్రలను కూడా కోరవచ్చు. ఇక బ్యాంకులు రుణ బదిలీకి సంభందించి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయవచ్చు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here