కార్మికులెవరూ రాలే..

0
3


కార్మికులెవరూ రాలే..


బోధన్‌లో డిపో ప్రధాన గేటు వద్ద తాత్కాలిక ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులు

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే : బోధన్‌లో కార్మికులెవరూ సోమవారం విధులకు హాజరు కాలేదు. ఉదయం 6 గంటలకు మొదటి సర్వీసును ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు డిపో నుంచి 32 బస్సులను నడిపారు. హైదరాబాద్‌కు వయా కామారెడ్డి 4, వయా మెదక్‌ 3, బాన్సువాడకు 7, దెగ్లూర్‌ 4, బిలోలి 2, నాందేడ్‌ 3, కల్దుర్కి 1. పొతంగల్‌ 5, వరంగల్‌కు 2 చొప్పున బస్సులు నడిపించారు. సూపర్‌ లగ్జరీ 11, డీలక్స్‌ 9 సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. నిజామాబాద్‌ రూట్లో అద్దె బస్సులను నడిపించుకోవడానికి అనుమతించారు. ఇప్పటివరకు 50 మంది కండక్టర్లు, 50 మంది డ్రైవర్లను తీసుకున్నామని, నియామకాలేవీ లేవని డీఎం వెంకటరమణ, ఎంవీఐ రాజు స్పష్టం చేశారు. ఎవరినీ కొత్తగా తీసుకోవడంలేదని వెల్లడించారు.

నిజామాబాద్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ డిపో -1 నుంచి 8 బస్సులు మాత్రమే నడిచాయి. వరంగల్‌ వైపు 2, జేబీఎస్‌ 1, భీమ్‌గల్‌ 1, నందిపేట్‌ 2, కామారెడ్డి వైపు 2 బస్సులు నడిచాయి. డిపో -2 నుంచి 30 సర్వీసులు తిప్పారు. కరీంనగర్‌కు 12, జేబీఎస్‌కు 10, భైంసా – 6, బాసర – 2, కామారెడ్డి వైపు 2 బస్సులు నడిపారు.

కామారెడ్డి

కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లాకేంద్రం నుంచి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 78 బస్సులు రోడ్డెక్కాయి. వీటిలో 44 ఆర్టీసీ, 34 అద్దె బస్సులున్నాయి. ఉదయం 7 గంటల వరకు 14, 9 గంటల వరకు 16, 11 గంటల వరకు 18, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 12, 3 గంటల వరకు 8, సాయంత్రం 5 గంటల వరకు 10 బస్సులు ఆయా మార్గాల్లో తిప్పారు. డీఎం మినహా కార్మికులు ఎవరూ రాకపోవడంతో 52 మంది డ్రైవర్లు, 56 మంది కండక్టర్లను తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌ వైపు 22 బస్సులు, నిజామాబాద్‌ వైపు 12, ఎల్లారెడ్డి వైపు 8, కరీంనగర్‌ వైపు 18, ఇతర మార్గాల్లో 18 బస్సులు నడిచాయి. టికెట్‌కు రూ. 50 నుంచి రూ.100 వరకు అధికంగా ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు తాత్కాలిక కండక్టర్లతో గొడవకు దిగారు.

బాన్సువాడ

బాన్సువాడ గ్రామీణం: బాన్సువాడలో కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగింది. డిపో పరిధిలోని 110 బస్సులకు గాను 45 బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీవి 25 కాగా హైర్‌ బస్సులు 20 ఉన్నాయి. 90 మంది ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో ఉన్నారు. బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు 7, నిజామాబాద్‌కు 13 బస్సులు, కామారెడ్డికి 7, బిచ్కుందకు 9, పిట్లంకు 5, ఆర్మూర్‌కు 2, ఎల్లారెడ్డికి 2 బస్సులు నడిచాయి.

ఆర్మూర్‌

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ డిపోనుంచి సోమవారం 55 సర్వీసులు నడిచాయి. అందులో ఆర్టీసీ – 41, అద్దె బస్సులు – 14 ఉన్నాయి. హైదరాబాద్‌కు-12, కరీంనగర్‌కు – 4, నిజామాబాద్‌కు 14, నిర్మల్‌ రూట్లో 10, మిగతావి భీమ్‌గల్‌, నందిపేట్‌ తదితర మార్గాల్లో నడిపారు


ఆర్మూర్‌ బస్టాండులో నిలిపిన బస్సులుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here