కార్మికుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి విడనాడాలి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గురువారం నిజామాబాదు జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో సిపిఎం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. గత ముప్పై నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మొండి పట్టుదలకు పోయి నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారమవుతుందన్నారు. ప్రభుత్వం అనవసరపు పట్టుదలకు వెళ్లి కార్మికుల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 25 మందికి పైగా కార్మికులు అనేకమంది ప్రజలు ఆర్టీసీ సమ్మె మూలంగా ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులకు ప్రజలు అండగా ఉండటం వల్లే సమ్మె విజయవంతం అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు భీమయ్య, జయరాం, యాదవ్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here