కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

0
0


కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వసతి గృహాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ..సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాల్లో పిల్లలకు వంట చేస్తూ వారిని కంటికి రెప్పలా చూస్తున్న కార్మికుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో ఏజెన్సీలను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరపు ఎల్లయ్య, శంకర్‌, సాయిలు, విజయ, సంపూర్ణ, భాగయ్య, రమేశ్‌, శ్రీహరి పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here