కార్మిక చట్టాల బిల్లును ఉపసంహరించుకోవాలి

0
0


కార్మిక చట్టాల బిల్లును ఉపసంహరించుకోవాలి

కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏఐసీటీయూ ప్రతినిధులు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కార్మిక చట్టాల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎంవీ చట్టం బిల్లును నిలిపివేయాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ. 18వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రక్షణ రంగంలో ఆర్డినెన్స్‌, కర్మాగారాల కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగన్న, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు, ఎల్లయ్య, సదానందం, రాజనర్సు, నర్సింలు, రమేశ్‌, భాస్కర్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి గ్రామీణం:: కార్మిక హక్కులను హరించే చట్టాలను సవరించాలని ఏఐసీటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌ మాట్లాడుతూ…ప్రభుత్వం సంస్కరణల పేరుతో యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను చేసేందుకు కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐసీటీయూ జిల్లా బాధ్యుడు రాజలింగం, ప్రతినిధులు రమేష్‌, కైరత్‌అలీ, సంజీవరెడ్డి, గంగాధర్‌, రాజయ్య, గంగరాజం, రాజు, బాబు, ప్రభు, భూమయ్య పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here