కార్యరూపం దాల్చిన కార్యాచరణ

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ముప్పై రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం ఎంపీపీ లోలపు రజినీ, ఎంపీడీవో గోపాలకష్ణ, ప్రజాపరిషత్‌ సిబ్బంది ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రపరిచారు. తమ వంతు బాధ్యతగా కార్యాలయ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా తమ కార్యాలయాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు నాటి ప్రభుత్వ కార్యాలయాలు పచ్చదనంతో కళకళలాడే విదంగా కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సుమలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here