కాలనీ సమస్యలపై కమీషనర్‌కు వినతి

0
2నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లిలోని బలహీన వర్గాల కాలనీలో అనేక సమస్యలతోఇబ్బంది పడుతున్నారని ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, కాలనీ అభివద్ధి కమిటీ అధ్యక్షులు ఎస్‌ వెంకటేష్‌, సురేష్‌ బాబు అన్నారు. సోమవారం ఆర్మూర్‌ కమీషనర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 2019 నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారని, అయినా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో వీధిలైట్లు లేక అంధకారంగా మారుతుందని కమిషనర్‌కు వివరించారు. వెంటనే వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తామని కమిషనర్‌ మాట ఇచ్చారని దాసు తెలిపారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీలు లేక ఈగలు, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, కాలనీ వాసులు రోగాలపాలవుతున్నారని వివరించారు. కమిషనర్‌ మాట్లాడుతూ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యేతో మాట్లాడగా నిధులు మంజూరుకి అంగీకరించారని, కనుక త్వరలో డ్రైనేజీలు కూడా నిర్మిస్తామని కమిషనర్‌ చెప్పారు. ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి దత్తత గ్రామం మామిడిపల్లిలో నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ పథకంలో ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో మామిడిపల్లి బలహీనవర్గాల కాలనీ అభివద్ధి కమిటీ నాయకులు మారుతి, లక్ష్మణ్‌, నసీర్‌, బాబు, లతీఫ్‌, ధర్మపురి, తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here