కాలిక్యులేషన్స్: HDFC నుంచి సులభంగా పర్సనల్ లోన్ పొందండి!

0
2


కాలిక్యులేషన్స్: HDFC నుంచి సులభంగా పర్సనల్ లోన్ పొందండి!

విహార యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా లేదా పెళ్లికి ప్లాన్ చేస్తున్నారా… మీ వద్ద డబ్బులు సరిపడా లేకుంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. వ్యక్తిగత రుణం తీసుకుంటే.. సులభ మార్గంగా నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ పరిమిత సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు. ఈ లోన్ తీసుకోవడానికి ప్రత్యేకంగా సెక్యూరిటీలు వంటివి అవసరం లేదు. ఉద్యోగి వేతనం అధారంగా పర్సనల్ లోన్ వస్తుంది. వ్యక్తిగత రుణం పొందేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరమో తెలుసుకోండి. హెచ్‌డఎఫ్‌సీ పర్సనల్ సులభంగా లోన్ ఇలా తీసుకోండి…

మీకు ఎంత అవసరం…

వ్యక్తిగత రుణం ఎందుకు అవసరమో, మీకు ఎంత అవసరమో మొదట ఓ నిర్ణయానికి రావాలి. పెళ్లికి లేదా ఇంటి పునరుద్ధరణకు లేదా విహార యాత్రకు.. ఇలా ఏ అవసరానికి అయినా మీకు ఎంత మొత్తం అవసరమో మొదట చూసుకోండి. ఎంతైనా దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు అవసరం ఏర్పడుతుంది.

రుణ అర్హత

రుణ అర్హత

మీకు ఎంత రుణం అవసరమో.. అంత మొత్తం ఆయా బ్యాంకులు ఇస్తాయా లేదా అనేది కూడా ముఖ్యమే. మీ వేతనం లేదా సంపాదన ఆధారంగా లోన్ అమౌంట్ ఉంటుంది. మీకు ఎంత వరకు రుణ అర్హత ఉందో చెక్ చేసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీలో మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ఈ బ్యాంకుకు చెందిన ఆన్ లైన్ Personal Loan eligibility calculator ద్వారా చెక్ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.40 లక్షల వరకు లోన్ ఆఫర్ చేస్తుంది.

మూడు ఫ్యాక్టర్స్...

మూడు ఫ్యాక్టర్స్…

మీ పర్సనల్ లోన్ EMI మూడు ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీ లోన్ అమౌంట్.. అంటే మీరు ఎంత మొత్తం తీసుకుంటున్నారు అనేది మొదటిది. వడ్డీ రేటు.. మీ లోన్ పైన ఎంత వడ్డీ రేటు ఉందనేది రెండోది. మూడోది కాలపరిమితి. వీటిపై మీ పర్సనల్ లోన్ ఈఎంఐ ఆధారపడి ఉంటుంది.

ఈఎంఐ..

ఈఎంఐ..

మీ ఈఎంఐ రెండు భాగాలుగా ఉంటుంది. వడ్డీ మరియు ప్రిన్సిపుల్ అమౌంట్. మీరు లోన్ తీసుకున్న ప్రారంభంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉండి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో ప్రిన్సిపుల్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది.

మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ కాలిక్యులేషన్స్

మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ కాలిక్యులేషన్స్

మీరు తీసుకునే రుణంపై ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలనే అంశాలు ఆన్ లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉంటుంది. మీరు తీసుకునే రుణం, మీకు అనుగుణంగా ఉండే ఈఎంఐ, కాల పరిమితిని ఎంచుకోవడం ద్వారా ఎంత చెల్లించవచ్చునో తెలుసుకోవచ్చు. మీకు అనుకూలంగా దానిని సవరించుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పర్సనల్ లోన్స్ పైన పాకెట్ ఫ్రెండ్లీ ఈఎంఐలను రూ.లక్షకు ప్రారంభ ధర రూ.2187 నుంచి ఆఫర్ చేస్తోంది.

ఇలా తెలుస్తుంది...

ఇలా తెలుస్తుంది…

Loan Amount, Tenure (Years), Rate of interest.. ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎంత మొత్తం కావాలి, కాలపరిమితి, రేట్ ఆఫ్ ఇంటరెస్ట్ ఫిల్ చేస్తే నెలకు ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత, కస్టమర్ ఎంత మొత్తం తీసుకున్నారు, అందుకు కాను అతను చెల్లించే మొత్తం ఎంత, వడ్డీ ఎంత కడుతున్నారు వంటి అంశాలు ఉంటాయి.

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..

ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా కూడా మీరు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్, వెబ్ సైట్, ఐటీఎం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ డాక్యుమెంట్స్ అవసరం

ఏ డాక్యుమెంట్స్ అవసరం

పర్సనల్ లోన్‌కు కొన్ని డాక్యుమెంట్స్ అవసరమవుతాయి. ఇన్‌కం ప్రూఫ్ (బ్యాంకు స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్, ఐటీ రిటర్న్స్) వంటివి అవసరమవుతాయి. వీటితో పాటు అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ ఇవ్వాలి. ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ అమౌంట్‌ను 10 సెకన్లలో, నాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు 4 గంటల్లో రుణం మంజూరు చేసి, అకౌంట్లో డబ్బు జమ చేస్తుంది. అయితే నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here