కాలితో రైలును ఆపేసిన మహిళ.. ఆఫీసుకు ఆలస్యమవుతోందంటూ రచ్చ!

0
1


మహిళ కాలితో ఏకంగా రైలునే ఆపేద్దాం అనుకుంది. చివరికి రైల్వే సిబ్బంది ఆమెను అడ్డుకోవడంతో ఆమె ప్రయత్నం ఫలించలేదు. రైలూ పోయింది.. ఆమె పరువూ పోయింది. చైనాలోని గ్వంగ్స్యూకు చెందిన ఓ మహిళ గత కొన్ని రోజులుగా ఆఫీసుకు ఆలస్యంగా వెళ్తోంది. కనీసం ఒక్కరోజైనా త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో సెక్యూరిటీ గేట్ (ఏఎఫ్‌సీ) దూకి మరీ రైలు వద్దకు పరుగు తీసింది.

అనంతరం బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉండే ఖాళీలో కాలు పెట్టింది. దీంతో రైలు కాసేపు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది ఆమెను వెనక్కి లాగేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరికి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది రోజులు తర్వాత ఆమెను విడుదల చేస్తామని తెలిపారు. ఆమెతోపాటు సెక్యూరిటీ గేటు దూకిన స్నేహితులకు వార్నింగ్ ఇచ్చి పంపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆమె రైలును ఆపేందుకు చేసిన ప్రయత్నం చూసి నవ్వుకుంటున్నారు. ఆఫీసుకు అంత త్వరగా వెళ్లాలనుకుంటే త్వరగా బయల్దేరవచ్చు కదా.. అంత రిస్క్ చేయడం ఎందుకని పలువురు సలహాలు ఇస్తున్నారు. మరికొందరు.. ఆమెకు తన పాదాలకంటే, ఆమెకు తన ఉద్యోమంటేనే ఇష్టమేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here