కాలేజీ బుల్లోడు.. తండ్రి జూనియర్, కూతురు సీనియర్.. వీరి కథ అమోఘం!

0
3


ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘కాలేజీ బుల్లోడు’ సినిమాలో కొడుకు చదువుతున్న కాలేజీలోనే తండ్రి కూడా చదువుతాడు. అచ్చం అలాంటి కథే.. నిజ జీవితంలో కూడా జరిగితే భలే ఉంటుంది కదూ. ఇదిగో ముంబయిలో అలాంటి కథే వెలుగు చూసింది. ఓ తండ్రి తన కూతురి కాలేజ్‌లోనే జూనియర్‌గా చేరి ఆశ్చర్యపరిచారు.

‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పేస్‌బుక్ పేజీలో ఓ యువతి తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘‘నాన్నకు న్యాయ శాస్త్రం అంటే చాలా ఇష్టం. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పట్లో ఆయన లా చదవలేకపోయారు. ఆ ఆశ చంపుకుని ఓ సంస్థలో ఉద్యోగానికి చేరారు. లా చదువుతున్న నా దగ్గర ప్రతి విషయం తెలుసుకొనేవారు. లాలో ఏయే సబ్జెక్టులుంటాయి, ఏమేమి బోధిస్తారు వంటి విషయాలు అడిగేవారు. దీంతో కాలేజ్‌కు వెళ్లి అవన్నీ తాను చదవగలననే నమ్మకం ఏర్పడింది’’ అని తెలిపింది.
ఇద్దరం ఒకే కాలేజ్: ‘‘చిత్రం ఏమిటో తెలుసా.. ఇప్పుడు మా నాన్న.. నేను చదువుతున్న కాలేజ్‌లోనే చదువుతున్నారు. ఆయన నా జూనియర్. మేం నిత్యం ప్రొఫెసర్లు, క్లాసులు, క్లాస్‌మేట్స్ గురించి మాట్లాడుకుంటాం. నా ఫ్రెండ్స్‌కు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనతో కూర్చుని మాట్లాడటం వారికి చాలా ఇష్టం. ఓసారి నేను నా ఫ్రెండ్స్‌తో కూర్చొని ఉంటే నాన్న మా వద్దకు వచ్చారు. మీతో కూర్చొలేను.. నా ఫ్రెండ్స్‌తో ఉంటానని ఆయన మాతో చెప్పడం నాకు నచ్చింది. భవిష్యత్తులో ఇద్దరం కలిసి లా ప్రాక్టీస్ చేస్తాం. ఆయన నా కోసం ఎంతో చేశారు. కాబట్టి.. నేను కూడా ఆయన కోసం ఏమైనా చేయాలనుకుంటున్నా. ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి’’ అని తెలిపింది. ఆమె చెప్పిన ఈ విషయాలు నెటిజనులకు బాగా నచ్చేసింది. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here