కాశ్మీర్‌ కార్పొరేట్‌ కంపెనీల పరం కాబోతుంది..

0
3నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్‌ ప్రజల హక్కులకై ఉద్యమిద్దాం అన్న అంశంపై జిల్లా ప్రెస్‌ క్లబ్‌లో సెమినార్‌ నిర్వహించారు. సిఎల్‌సి జిల్లా అధ్యక్షులు మువ్వా నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా హాజరైన పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది వి.రఘునాథ్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షల ప్రమేయమే లేకుండా, వారికి ఉన్న ప్రత్యేక చట్టబద్ధ హక్కులను ఆర్టికల్‌ 370, 35 లను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అమానుషమైన నిర్బంధాన్ని అమలు చేస్తూనే రద్దు చేసిందని తెలిపారు. కాశ్మీరీ యువతను విద్యార్థులను వారు సాగిస్తున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి, వారిని మిల్ట్రీ క్యాంపుల్లో బందీ చేసి, కాశ్మీర్‌ ప్రశాంతంగా ఉందని ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. కార్పొరేట్‌ కంపెనీల పెట్టుబడులతో కాశ్మీర్‌ కంపెనీల పరం కాబోతున్నది అసలు వాస్తవమన్నారు. స్వేచ్ఛా, హక్కుల కోసం కాశ్మీర్‌ ప్రజలు చేస్తున్న పోరాటానికి మనందరం మద్దతివ్వాల్సిన అవసరముందన్నారు. మరో వక్తగా వచ్చిన ఏపిటిఎఫ్‌ మాజి రాష్ట్ర అధ్యక్షులు ఏ.నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్‌ ప్రజల సంస్కతి ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. కాశ్మీర్‌ ప్రజలు స్వేచ్ఛకోసం ప్రాణాలైనా అర్పిస్తారన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here