కిర్రాక్ లుక్‌లో విజయ్ దేవరకొండ.. వైరల్

0
2


సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మనకు ముందుగా ‘అర్జున్ రెడ్డి’లోని గుబురు గెడ్డం లుక్ గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ లుక్ విజయ్‌కి ట్రేడ్ మార్క్ అయిపోయింది. ఆ తరవాత ‘గీతగోవిందం’లో విజయ్ క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించారు. కానీ, ఈ మధ్య వచ్చిన ‘డియర్ కామ్రేడ్’లో మరోసారి గుబురు గెడ్డంలో దర్శనమిచ్చారు. ఈ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనూ విజయ్ గెడ్డంతోనే కనిపించారు. దీంతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యారు. ఎప్పుడూ ఇదే లుక్కా అని పెదవి విరిచారు.

అయితే, తన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ అదిరిపోయే క్లీన్ షేవ్ లుక్‌లో తాజాగా విజయ్ కనిపించారు. గతంలో విజయ్ క్లీన్ షేవ్‌లో కనిపించిన లుక్‌కి.. ఈ కొత్తలుక్‌కి తేడా ఉంది. ఈ కొత్త లుక్‌లో విజయ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. అంతేకాదు, ట్రిమ్ చేసిన గెడ్డం కూడా కొత్తగా ఉంది. దీంతో ఈ లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ కేఎల్ఎం షాపింగ్ మాల్‌కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో కొత్త షోరూంను ఏర్పాటుచేసింది. ఈ షోరూంను గురువారం విజయ్ దేవరకొండ ప్రారంభించారు. విజయ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా షోరూం వద్దకు తరలివచ్చారు. అయితే, ఈ సందర్భంగా విజయ్ తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: మెగాస్టార్ అంటే పిచ్చి.. అందుకే లేడీ ‘గ్యాంగ్ లీడర్’ అయ్యింది!

కాస్ట్యూమ్స్ విషయంలో డిఫరెంట్‌గా ఆలోచించే విజయ్ దేవరకొండ.. షోరూం ఓపెనింగ్‌కి కూడా వెరైటీ డ్రెస్‌లో వచ్చారు. విజయ్ ధరించిన జాకెట్, ఆయన హెయిర్ స్టైల్, కళ్లజోడు అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. మొత్తానికి మరోసారి విజయ్ దేవరకొండ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here