కిషోర్‌కి ఎంతసేపు అదే పని: రకుల్ ప్రీత్ సింగ్

0
4


కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొని మాట్లాడారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తనకు కథ చెప్పినప్పుడు ఈ చిత్రం తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు రకుల్ చెప్పారు. అవంతిక పాత్ర తానే చేయాలని డిసైడ్ అయిపోనట్టు వెల్లడించారు.

‘‘అవంతిక లాంటి పాత్ర చాలా తక్కువ సినిమాల్లో ఉంటుంది. ఇంత మంచి ప్రాధాన్యత, క్యారెక్టర్ గ్రాఫ్, నాటీనెస్ పాత్ర ఎప్పుడో కానీ దొరకదు. అందుకే, అవంతిక పాత్రలో జీవించాలని నిర్ణయించుకున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాహుల్‌కి కృతజ్ఞతలు. తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరవాత నేను బాగా ఎంజాయ్ చేసిన పాత్ర ఇది. నా తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కన్నా ముందు నుంచే రాహుల్ నాకు తెలుసు. భడే భయ్యా అంటూ పిలిచేదాన్ని. మేమిద్దరం కలిసి పనిచేస్తామని ఎప్పుడూ అనుకోలేదు’’ అని రకుల్ చెప్పుకొచ్చారు.

నాగార్జునను కింగ్ అని ఎందుకంటారో తనకు ఇప్పుడు అర్థమైందని రకుల్ పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనతో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభూతినిచ్చిందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకు తెలిసిన గొప్ప వ్యక్తి నాగార్జున అంటూ కొనియాడారు. మొత్తం యూనిట్ పట్ల నాగార్జున చూపించిన కేరింగ్ చూసి ఆయనపై గౌరవం మరింత పెరిగిందని రకుల్ వెల్లడించారు. ఆయన పక్కన ఉంటే భద్రత ఉన్నట్టేనన్నారు. తనకు ఒక సోలో టీజర్ కూడా ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. నాగార్జున ఎంతో మందికి స్ఫూర్తి అని ఆకాశానికి ఎత్తేశారు.

ఇక హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘కిషోర్‌కి సెట్‌లో ఎప్పుడూ తినడం, మాట్లాడం ఇదొక్కటే పని’’ అని రకుల్ అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుందని చెప్పారు. సినిమాటోగ్రాఫర్ సుకుమార్ తనను ఎంతో అందంగా చూపించారని అన్నారు. ఈ విషయంలో సుకుమార్‌కు థ్యాంక్స్ చెప్పారు. సీనియర్ నటి లక్ష్మితో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ రకుల్ సినిమాలో చింపేసిందంటూ ప్రశంసించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here