కుడి ఎడమైంది.. అతడి శరీరంలో అవయవాలన్నీ తారుమారు!

0
1


మానవ శరీరంలో గుండె ఎడమ వైపు, కాలేయం కుడి వైపు ఉంటుందనే సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ వ్యక్తిలో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇతడికి గుండె కుడి వైపు, కాలేయం ఎడమ వైపు ఉన్నాయి. కుషీనగర్‌కు చెందిన ఈ వ్యక్తి అవయవాలు ఉండాల్సిన చోటు కాకుండా వ్యతిరేక దిశలో ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది.

Read also: మొబైల్‌లో పాటలు వింటూ బాలిక దుర్మరణం, ఆ తప్పే ప్రాణం తీసింది!

ఇతడి గుండే, కాలేయాలే కాదు.. పిత్తాశయం కూడా ఉండాల్సిన చోట కాకుండా దానికి వ్యతిరేక దిశలో ఉంది. అంటే.. ఈ వ్యక్తి పుట్టుకే తేడా అని వైద్యులు చెబుతున్నారు. మనం అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే వ్యతిరేక ప్రతిబింబంలా అతడి అవయవాలు ఉన్నాయట. ఇటీవల ఈ వ్యక్తికి కడుపు నొప్పి రావడంతో గోరక్‌పూర్‌లోని వైద్యుడిని సంప్రదించాడు. ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ రిపోర్టులు చూసిన వైద్యుడు అతడి అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.

Read also: షాకింగ్.. ఫే‌స్ క్రీమ్‌ రాసుకోగానే కోమాలోకి, మహిళ పరిస్థితి విషమం

ఈ వ్యక్తిని పరీక్షించిన వైద్యుడు డాక్టర్ శశికాంత్ దీక్షిత్ మాట్లాడుతూ..‘‘కడుపు నొప్పిగా ఉందని వచ్చిన అతడికి వైద్య పరీక్సలు చేయగా పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు తెలిసింది. కానీ, వాటిని త్రి-డైమెంన్షనల్ ల్యాప్రోస్కోపిక్ మెచిన్స్ ద్వారా తొలగించడం కష్టం. అది కేవలం అవయవాలు సరైన స్థానంలో ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాళ్లను తొలగించాలంటే సర్జరీ చేయడం ఒక్కటే మార్గం. అవయవాలు ఇలా వ్యతిరేక దిశలో ఉండటాన్ని ‘సీటస్ ఇన్వెర్సస్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి తమ అవయవాలు వ్యతిరేక దిశలో ఉన్నట్లు తెలియదు. వారికి ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు మాత్రమే అసలు విషయం తెలుస్తోంది. అయితే, ఇలా వ్యతిరేక దిశలో అవయవాలు ఉండటం అనేది చాలా అరుదు. ఇప్పటివరకు 1643 మందికి మాత్రమే అవయవాలు ఉండాల్సిన చోట కాకుండా వ్యతిరేక దిశలో ఉన్నట్లు తెలిసింది’’ అని తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here