కుప్పకూలిన మార్కెట్లు: 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ 11,000 కంటే తక్కువ

0
1


కుప్పకూలిన మార్కెట్లు: 600 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ 11,000 కంటే తక్కువ

ముంబై: భారతీయ షేర్ మార్కెట్లు గురువారం నాడు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్లు నష్టపోయింది. ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. తొమ్మిదింపావు సమయానికి సెన్సెక్స్ 212 పాయింట్లు నష్టపోయి 37,269 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 11,054 వద్ద ట్రేడ్ అయింది. 200 వరకు కంపెనీల షేర్లు లాభాల బాటపట్టగా, 500కు పైగా కంపెనీల షేర్లు నష్టాల్లో న్నాయి. పదుల సంఖ్యలో కంపెనీల షేర్లలో మార్పు లేదు.

దాదాపు అన్ని రంగాలు నష్టాలనే చవి చూశాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఫార్మా, మెటల్ షేర్లు కరిగిపోయాయి. సెన్సెక్స్ ఈ ఏడాది మార్చి తర్వాత మొదటిసారి 600 పాయింట్లు నష్టపోయి 37,000 కంటే దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 11,000 మార్క్ దిగువకు చేరింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ అయిదు వారాల కనిష్టానికి చేరుకుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది.

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. ఫార్మా షేర్లు పడిపోయాయి. మెటల్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.20 వద్ద డ్రేట్ అయింది. బుధవారం రూ.68.79 వద్ద ట్రేడ్ అయింది. 40 పైసలకు పైగా నష్టపోయింది.

యూఎస్ ఫెడరల్ బ్యాంకు బుధవారం సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన కామెంట్స్.. అమెరికా మార్కెట్ పతనానికి కారణమైంది. రేట్ కట్ సైకిల్‌కు తాజా నిర్ణయం ఆరంభం కాదని, ప్రస్తుత తగ్గింపు తర్వాత రేట్ కట్స్ కొనసాగకపోవచ్చునని చెప్పారు. అంటే ఈ తగ్గింపు తర్వాత మళ్లీ ఉండకపోవచ్చునని పరోక్షంగా వెల్లడించారు. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది.

వేదాంత, టాటా మోటార్స్ వంటి కంపెనీల షేర్లు 4 శాతం తగ్గాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. యూపీఎల్ లిమిటెడ్ షేర్లు 3 శాతం మేర నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ జూలై నెలలో 17 ఏళ్ల తర్వాత ఇంతటి క్లిష్ట పరిస్థితిని చవి చూస్తున్నాయి. టెలికం సంస్థ భారతీ ఎయిర్ టెల్ 3 శాతం నష్టాల్లో ట్రేడ్ అయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here