కుల నిర్మూలన సదస్సు

0
5నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ది సంఘం (పిడిఎస్‌యు) ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావ్‌ ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌ 147 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని విజయ్‌ డీగ్రీ కళాశాలలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. సదస్సుకు పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు ఎం. నరేందర్‌ అధ్యక్షత వహించగా, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ నాయకులు సుమన్‌ ముఖ్య వక్తగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జ్యోతిరావ్‌ ఫూలే తన భార్య సావిత్రి భాయి ఫూలేకి చదువు చెప్పి ఆమె ను తీర్చిదిద్ది బాలికలకోసం వితంతువుల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి, అందులో తన భార్యతో చదువు చెప్పించారన్నారు. బాలిక విద్య కోసం పరితపించారని, ఆ క్రమంలో బ్రాహ్మణాధిపత్య వర్గాలచే అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా కషి చేశారని అన్నారు. తరాలు గడుస్తున్నా వారు కోరుకున్న కులాలు లేని, వివక్షత లేని సమాజం రాలేదని, కుల సమస్య ఏ ఒక్కరిలోనో ఉన్న సమస్య కాదని, అన్ని కులాల్లో ఉన్న ప్రజలందరి సమస్య కావున అన్ని కులాల్లో ఉన్న ప్రజలందరూ చైతన్య వంతమై కులాలు వద్దు అనుకున్నప్పుడే కుల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. కాబట్టి ఆ దిశగా చైతన్యం చేసే వెలుగులో ఆచరణాత్మక కషి చేద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమానికి ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు నరేందర్‌ అధ్యక్షత వహించగా ప్రజ్ఞా విద్యా సంస్థల చైర్మన్‌ గంగామోహన్‌, నిఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here