కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు

0
3


కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే : నాగార్జునసాగర్‌ దిగువన కృష్ణానదిలో వ్యక్తి గల్లంతైన ఘటన ఆదివారం జరిగింది. సాగర్‌ ఎస్సై శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ రూరల్‌కు చెందిన ఎన్నెం విజయ్‌(19) హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న అతని మిత్రుడు రాంబాబుతో కలిసి ఆదివారం సాగర్‌ సందర్శనకు వచ్చారు. విజయ్‌, రాంబాబు మద్యం తాగి పైలాన్‌ శివాలయం ఘాట్‌ వద్ద స్నానం కోసం నీటిలోకి దిగారు. అదే సమయంలో రాంబాబు చరవాణికి ఫోన్‌ రావడంతో ఒడ్డుకెక్కి అతను ఫోన్‌ మాట్లాడుతుండగా ఈత రాని విజయ్‌ నీటిలో మరింత లోతులోకి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతైనట్లు తెలిపారు. విజయ్‌ ఆచూకి లభ్యం కాలేదని, రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రధానాంశాలుSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here