కేంద్రం ఇచ్చిన మాట తప్పుతోంది

0
1నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన మహాధర్నాలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసి మూడు సంవత్సరాలు అవుతుందని, ఒక్కో వ్యక్తి ఖాతాలో 14 లక్షల రూపాయలు వేస్తామని, 14 రూపాయలు కూడా వేయలేదన్నారు. ఎక్కడ కూడా చర్చించకుండా రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేశారని, నోట్లు రద్దు చేసిన 50 రోజుల్లో ఆర్థిక వ్యవస్థను మార్చేస్తామని ప్రగల్బాలు పలికారని ధ్వజమెత్తారు. 16 లక్షల కోట్ల నోట్ల రద్దుపై ఎంత జమ అయిందో రెండున్నర సంవత్సరాలలో లెక్క చెప్పలేకపోయారని, నోట్ల రద్దు తర్వాత ఒక్క రూపాయి ఎవ్వరికీ ఇవ్వలేదు గాని కొత్త నోట్ల ప్రింటింగ్‌ కోసం 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు చేసినపుడు ప్రధాని మోడీపై మాట్లాడవద్దని కేసీఆర్‌ అన్నారని, నోట్ల రద్దు, జిఎస్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు పలికారని, ఇప్పుడేమో జిఎస్టీ వల్ల 30 వేల కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారన్నారు. ఊసర వెళ్లిలా రంగులు మార్చడంలో నంబర్‌ వన్‌ కేసీఆర్‌ అని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఒక్క చుక్క నీరివ్వని కేసీఆర్‌ కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లోనే ప్రస్తుతం నీళ్లున్నాయని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ ద్వారా 3 లక్షల 5 వేల ఎకరాలకు నీళ్లిచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతాలను సస్యశ్యామలం చేసే వాళ్ళమన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here