కేజీబీవీల్లోనూ బయోమెట్రిక్‌

0
0


కేజీబీవీల్లోనూ బయోమెట్రిక్‌

త్వరలో అమలుకు సన్నాహాలు

అమ్దాపూర్‌ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల

విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదులో పారదర్శకత కోసం ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సర్కారు బడుల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తోంది. దీన్ని త్వరలో కస్తూర్బాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే విద్యార్థినుల హాజరు, ఉపాధ్యాయినుల సమయపాలన, భోజనం అమలు మెరుగు పడనుందని అధికారులు భావిస్తున్నారు.

న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం

నిజమాబాద్‌ జిల్లాలో 25 కేజీబీవీలు ఉన్నాయి. మొత్తం 5,040 మంది విద్యార్థినులు చదువుకొంటున్నారు. గతేడాది అమ్దాపూర్‌, డిచ్‌పల్లి, బాల్కొండ, ఆర్మూర్‌లలో ఇంటర్‌ తరగతులను ఏర్పాటు చేయగా.. ఈసారి మాక్లూర్‌, భీమ్‌గల్‌, నిజామాబాద్‌, జక్రాన్‌పల్లిలో ప్రారంభించారు. ఇంటర్‌లో 738 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఆయా విద్యాలయాల్లో 193 మంది ఉపాధ్యాయినులు, 54 మంది అధ్యాపకులు, 175 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. విద్యార్థినుల హాజరు, భోజనం తదితర అంశాల అమల్లో పారదర్శకత కోసం ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్‌ విధానాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేజీబీవీల్లోని ఒకరికి శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలకు ఒక యంత్రం చొప్పున ఇవ్వనున్నారు. ఇందుకోసం విద్యార్థినులు, ఉపాధ్యాయినుల ఆధార్‌ నంబరు, వేలిముద్రలను సేకరిస్తున్నారు.

నిరంతరం పర్యవేక్షణ

శకుంతలదేవి, సెక్టోరల్‌ అధికారిణి, నిజామాబాద్‌

కేజీబీవీలను మరింత బలోపేతం చేసి పారదర్శకంగా నిర్వహించడానికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో త్వరలో బయోమెట్రిక్‌ మిషన్లు అందించనున్నాం. ప్రతి విద్యార్థి, బోధన సిబ్బంది తప్పనిసరిగా హాజరువేయాల్సి ఉంటుంది. దీనిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here