కేసీఆర్ కుటుంబ పాలన.. బీజేపీ డోర్లు తెరిస్తే టీఆర్ఎస్ ఎంపీలు కారులో ఉంటారా? : రఘునందన్

0
4


కేసీఆర్ కుటుంబ పాలన.. బీజేపీ డోర్లు తెరిస్తే టీఆర్ఎస్ ఎంపీలు కారులో ఉంటారా? : రఘునందన్

కరీంనగర్‌ : సీఎం కేసీఆర్‌పై.. టీఆర్ఎస్ పార్టీ విధానాలపై.. గులాబీ నేతలపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని.. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ గనక డోర్లు బార్లా తెరిస్తే టీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఎంపీ కూడా మిగలబోరని.. కారు దిగి కాషాయం కండువా కప్పుకోవడం ఖాయమన్నారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు పలు అంశాలను ప్రస్తావించారు.

సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు రఘునందన్ రావు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు సేవ సప్తాహ కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెలో జాతీయ జెండాలు ఎగుర వేస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని.. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఆ పార్టీని దెబ్బ తీస్తాయని వ్యాఖ్యానించారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here