కొత్త ఫండ్స్ కొరత.. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే?

0
2


కొత్త ఫండ్స్ కొరత.. మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే?

మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నుంచి కొత్త ఫండ్ ఆఫర్స్ తగ్గిపోయాయి. కొత్త ఆఫర్లు తెచ్చే ముందు సంస్థలు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంటోంది. ఇందుకు కారణం మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు. ఊహించకుండా జరుగుతున్న పరిణామాల వల్ల అటు కంపెనీలకు ఇటు ఇన్వెస్టర్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కొత్తపథకాలు తీసుకురావడానికి కంపెనీలు, పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు సందేహిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే తాజాగా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ, అభివృద్ధి సంస్థ సెబీ వెల్లడించిన గణాంకాలు. అవేమిటంటే..

ఇప్పటివరకు 125 మాత్రమే…

* ఈ ఏడాది ముగియడానికి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు దాదాపు 125 కొత్త పథకాలకు సంభందించిన పత్రాలను మాత్రమే సెబీ ముందుంచాయి. ఎందుకోసమంటే వీటికి అనుమతి కోసమన్నమాటా. గత ఏడాది మొత్తంగా 211 పథకాల అనుమతుల కోసం సెబీ ముందుకు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు వెళ్లాయి. దీనిని బట్టి చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. సెబీకి సమర్పించిన వాటిలో కొన్నింటికి అనుమతులు రాగా వాటిని కంపెనీలు మార్కెట్లోకి తెచ్చాయి.

* కొత్త ఫండ్ ఆఫర్లు ఎందుకు తగ్గాయంటే.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా కనిపిస్తోందని ఫండ్ సంస్థలు అంటున్నాయి. డెట్ ఫండ్స్ లో నగదు సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. కాబట్టి పరిస్థితి ఏమాత్రం సానుకూలంగా లేదని కంపెనీలు అంటున్నాయి.

* ఫిక్స్డ్ మెచూరిటీ, ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ , రిటైర్ మెంట్, సస్టేనబుల్ ఈక్విటీ ఫండ్, బిజినెస్ సైకిల్ ఫండ్ వాటి విభాగాల్లో కంపెనీలు దరఖాస్తులు సమర్పించాయి.

* ఇండెక్స్ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్ కు కంపెనీలు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నాయి.

మార్కెట్ ను బట్టి...

మార్కెట్ ను బట్టి…

* మార్కెట్లో నెలకొన్న పరిణామాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లు జోరుగా ముందుకు సాగుతున్నప్పుడు కొత్త ఫండ్స్ ఎక్కువ వస్తుంటాయని, మార్కెట్లు బాగోలేనప్పుడు తక్కువ ఫండ్స్ వస్తుంటాయని వారు అంటున్నారు.

* గత ఏడాదిన్నర కాలంలో కొన్ని ఫండ్స్ మినహా చాలా వరకు ఈక్విటీ ఫండ్స్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. ముఖ్యంగా మిడ్, స్మాల్ క్యాప్స్ లో ఇది ఎక్కువగా ఉందని అంటున్నారు. డెట్ ఫండ్స్ కు సంభందించి చాలా చేదు వార్తలను ఇన్వెస్టర్లు వినాల్సి వచ్చింది.

పెట్టుబడులు వెనక్కి

పెట్టుబడులు వెనక్కి

* వివిధ గ్రూపుల్లో నెలకొన్న రుణ సంక్షోభాలతో ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్, ఎస్సెల్, డీ హెచ్ ఎఫ్ ఎల్ వంటి దిగ్గజ కంపెనీలు రుణ సంక్షోభాల్లో పడిన విషయం తెలిసిందే.

* ప్రస్తుతం 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీలున్నాయి. వీటి నిర్వహణలో ఆస్తుల విలువ 25 లక్షల కోట్లకు పైగా ఉంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here