కొనసాగుతున్న రైతు రిలే దీక్షలు

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టా పాసు పుస్తకాల కోసం రెంజల్‌ మండలంలోని తహసీల్‌ కార్యాలయం వద్ద కందకుర్తి రైతులు చేపట్టిన దీక్ష మంగళవారానికి ఏడవ రోజుకు చేరుకుంది. తమ భూములకు సంబంధించిన పట్టా పాస్‌ పుస్తకాలు తమకు ఇచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్నా తమ సమస్య పరిష్కారం కోసం ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించేవరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here