కొనసాగుతున్న వరద ప్రవాహం

0
2


కొనసాగుతున్న వరద ప్రవాహం

పోచంపాడ్‌(మెండోరా), న్యూస్‌టుడే: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి దాదాపు 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులోకి శనివారం ఉదయం 24,905 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మధ్యాహ్నానికి 11,850 క్యూసెక్కులకు తగ్గింది. మళ్లీ సాయంత్రానికి 14,909 క్యూసెక్కులకు పెరిగి వరద కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 1061.50 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటినిల్వ 15.291 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 372 క్యూసెక్కులు వెళ్తోంది. గతేడాది ఇదేరోజు ప్రాజెక్టులో 1062.10 అడుగులు(16.069 టీఎంసీలు) నీరు నిల్వ ఉండేదని అధికారులు పేర్కొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here