‘కొబ్బరి మట్ట’: సంపూ వరల్డ్ రికార్డ్.. సింగిల్ టేక్‌లో అతిపెద్ద డైలాగ్

0
8


బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మూడో చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ఒకటి పాపారాయుడు, మరొకటి పెదరాయుడు కాగా.. ఇంకొకటి ఆండ్రాయిడు. ఇప్పటికే పాపారాయుడు, పెదరాయుడు పాత్రలను పరిచయం చేశారు. మహిళ గొప్పతనాన్ని వివరిస్తూ నిమిషానికి పైగా నిడివితో పెదరాయుడు (సంపూర్ణేష్ బాబు) టీజర్‌లో చెప్పిన డైలాగ్‌కు ప్రశంసలు అందాయి. ఆ డైలాగులో వెటకారాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ పెదరాయుడికి పోటీగా ఆండ్రాయిడు చాంతాడంత డైలాగుతో వచ్చాడు.

ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. తాజాగా విడుదలైన ఆండ్రాయిడు పరిచయ ట్రైలర్‌లో 3.27 నిమిషాల నిడివితో నాన్ స్టాప్ డైలాగ్ ఉంది. ఈ డైలాగును సంపూర్ణేష్ బాబు సింగిల్ టేక్‌లో చెప్పారట. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ సంపూర్ణేష్‌ను ఆండ్రాయిడ్‌గా పరిచయం చేస్తూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో ఆండ్రాయిడుగా సంపూ చించేశాడు. తన డైలాగ్ పవర్‌ను చూపించాడు.

‘‘ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్లుగా మారాలో వాడు రాబోతున్నాడు! చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు! వచ్చాక చెప్పుకునే సునామీ వాడు! సో అయామ్ ప్రెజెంటింగ్ యు ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడు!’’ అనే ఇంట్రడక్షన్‌తో సంపూర్ణేష్ యంగ్ అవతారంలో దర్శనమిచ్చాడు. ఇక అక్కడి నుంచి రాయుడి మీద డైలాగుతో విరుచుకుపడ్డాడు. సంపూ డైలాగ్ చెబుతున్నప్పుడు టైమర్‌ను కూడా స్క్రీన్‌పై రన్ చేశారు. కరెక్ట్‌గా 3.27 నిమిషాల డైలాగ్. ఇంతకీ ఈ ఆండ్రాయిడు.. పెదరాయుడు కొడుకే. తండ్రి మీద ఇతగాడి యుద్ధమెందుకో సినిమాలోనే చూడాలి!

కాగా, ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలం సాయి రాజేష్ నిర్మించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. కమ్రాన్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here