కొరవడిన ‘సహకారం’

0
3


కొరవడిన ‘సహకారం’

మహాజన సభలో సభ్యుల మధ్య వాగ్వాదం

● సమన్వయంలో విఫలమవుతున్న యంత్రాంగం


సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీ

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాలు, అందులో పనిచేసే యంత్రాంగం, సిబ్బంది, డీసీసీబీ అధికారులు, రాష్ట్ర సహకార బ్యాంకు (టీస్కాబ్‌), ప్రభుత్వ అధికారులు.. వీరంతా సమన్వయంతో పని చేసినప్పుడే ‘సహకార వ్యవస్థ’ సక్రమంగా ఉంటుంది. కానీ ఎవరికివారుగా వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఛైర్మన్‌ గంగాధర్‌రావు పట్వారీ అధ్యక్షతన మంగళవారం ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన డీసీసీబీ, ఐడీసీఎంఎస్‌ ఉమ్మడి మహాజన సభ వాగ్వాదాలకు వేదికైంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఓ సహకార సంఘానికి వెళ్లిన డీసీసీబీ అధికారి సంబంధిత కార్యదర్శి స్థానికంగా లేకపోవడంతో పాటు కనీసం సెలవు పత్రం కూడా లేకుండా ఎక్కడికి వెళ్లారని గద్దించినట్లు ఆరోపించారు. బ్యాంకు అధికారులు తమపై అజమాయిషీ ఏంటని కొంత మంది కార్యదర్శులు నేరుగా సభకు వచ్చి ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. ఇక్కడివరకు వచ్చి అడిగే సందర్భం కాదని డైరెక్టర్లు ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. సహకార సంఘాలకు సమాచారం లేకుండానే జనతా బీమా రైతుకు రూ. 2.50 లక్షల నుంచి రూ. లక్షకు పరిహారం తగ్గించడంపై వాదనలకు దిగారు. ప్రీమియం కట్టేది సంఘాలే.. ఎక్కువైనా భరించేవారమన్నారు. పాత పద్ధతినే ఎందుకు కొనసాగించలేదని నిలదీశారు. టీస్కాబ్‌ నుంచి వచ్చిన ఆదేశాలనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని సీఈవో అనుపమ సమాధానమిచ్చారు. ధాన్యం కొనుగోళ్ల కమీషన్‌ డబ్బుల కోసం ఎన్నేళ్లు వేచి చూడాలని సభ్యులు ప్రశ్నించారు. త్వరలో మూడు సీజన్లకు సంబంధించిన బకాయిలు వస్తాయని డీసీవో సింహాచలం సమాధానమిచ్చారు. సకాలంలో గన్నీ సంచులు రాకపోవడంతో ఏటా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కావొద్దని ఛైర్మన్లు సూచించారు.

పంటలన్నీ కొంటాం..

ప్రభుత్వ మద్దతు ధరతో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయోత్పత్తులన్నీ కొంటామని ఐడీసీఎంఎస్‌ స్పష్టం చేసింది. ముజీబుద్దీన్‌ అధ్యక్షతన సొసైటీ వ్యాపార లావాదేవీలు, వార్షిక లెక్కలపై పలు తీర్మానాలు చేశారు. గతేడాది కొనుగోళ్లతో రూ. కోటి ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here