కొరియా ఓపెన్‌లో ముగిసిన భారత పోరాటం: సెమీస్‌లో కశ్యప్‌ ఓటమి

0
4


హైదరాబాద్: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీలో భారత పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో కశ్యప్‌ 13-21, 15-21 తేడాతో ప్రపంచ చాంపియన్‌ కెంటో మొమాటా(జపాన్‌) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

తొలి గేమ్‌ను 13-21తో కోల్పోయిన కశ్యప్… రెండో గేమ్‌లోనూ పుంజుకోలేకపోయాడు. దీంతో రెండో గేమ్‌లో 15-21 ఓడిపోయి మ్యాచ్‌ని సైతం చేజార్చుకున్నాడు. వీరిద్దరి మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా రెండు మ్యాచ్‌ల్లోనూ మొమాటా విజయం సాధించడం విశేషం. కశ్యప్ ఓటమితో కొరియా ఓపెన్‌లో భారత్‌ పోరాటం ముగిసింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here