కొల్లి శ్రీధర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

0
0


కొల్లి శ్రీధర్‌కు అంతర్జాతీయ ఖ్యాతి

వెన్నెముక చికిత్సల్లో ప్రతిభకు పురస్కారం


ఇంగ్లండ్‌లో శ్రీధర్‌ను అభినందిస్తున్న బ్రిటిష్‌ మహారాణి ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ ఆనీ

బీర్కూర్‌, న్యూస్‌టుడే: వెన్నెముక రోగులకు అందించిన వైద్య సేవలకు బీర్కూర్‌ మండల వాసి వెన్నెముక వైద్యుడు కొల్లి శ్రీధర్‌కు ఇంగ్లాండ్‌లో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెన్నెముక రోగులకు అందించిన ఆధునిక వైద్య సేవలను బ్రిటిష్‌ ప్రభుత్వం గుర్తించింది. ఆ దేశంలో వైద్యులకు ఇచ్చే ’స్టిఫెన్‌ బ్రాడ్‌షా’ 2019 పురస్కారాన్ని ఈ నెల 11న ఇంగ్లాండ్‌లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆ దేశ మహారాణి ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ ఆనీ చేతుల మీదుగా శ్రీధర్‌కు అందజేశారు. శ్రీధర్‌ తన తండ్రి కొల్లిగాంధీతో కలిసి హైదరాబాద్‌లో ఉన్న శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి అవార్డు వివరాలను తెలిపారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here