కోటగిరిలో ఉచిత వైద్య శిబిరం

0
0



నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్‌ పట్టణ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ వైద్య బందం అంకం ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి బీర్కుర్‌ సుధాకర్‌, కోటగిరి నివాసి, తను పుట్టిన గ్రామంలో సేవచేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. వైద్య శిబిరానికి విచ్చేసిన ఆయా విభాగాల వైద్యులందరికి కోటగిరి మండల ప్రజల తరుపున కతజ్ఞతలు తెలిపారు. పెద్ద ఎత్తున కోటగిరి ప్రజలు శిబిరాన్ని వచ్చి సద్వినియోగం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here