కోడెల‌పై వేటు త‌ప్ప‌దా..! సొంత నియోజ‌క‌వ‌ర్గ‌ టీడీపీ నేత‌ల షాక్‌: చ‌ంద్ర‌బాబు వ‌ద్ద పంచాయితీ..!

0
0


కోడెల‌పై వేటు త‌ప్ప‌దా..! సొంత నియోజ‌క‌వ‌ర్గ‌ టీడీపీ నేత‌ల షాక్‌: చ‌ంద్ర‌బాబు వ‌ద్ద పంచాయితీ..!

  కోడెల శివ ప్ర‌సాద్ మీద వేటు వేయాలంటున్న టీడీపీ నేతలు || Oneindia Telugu

  టీడీపీ సీనియ‌ర్ నేత..మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ మీద వేటు త‌ప్ప‌దా. ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల టాక్స్ పేరుతో వ‌స్తు న్న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసులు..ముంద‌స్తు బెయిల్ వ్య‌వ‌హారాల‌తో త‌ల‌బొప్పి కట్టిన కోడెల‌కు ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల నుండే అసమ్మ‌తి మొద‌లైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో మొద‌లైన సొంత పార్టీ నేత‌ల వ్య‌తిరేక‌త ఇప్పుడు మ‌రో సారి నేరుగా పార్టీ అధినేత వ‌ద్ద‌కు చేరింది. అనేక ఆరోప‌ణ‌లు..వ‌సూళ్ల‌తో పార్టీ ప్ర‌తిష్ట దిగ‌జార్చార‌ని అటువంటి నేత ఆధ్వ‌ర్యంలో తాము ప‌ని చేయ‌టానికి సిద్దంగా లేమంటూ స‌త్తెన‌ప‌ల్లి లోని కోడెల వ్యతిరేక వ‌ర్గం టీడీపీ రాష్ట్ర కార్యా ల‌యం వ‌ద్ద ధ‌ర్నా చేసింది. కోడెల‌పైన వేటు వేయాల‌ని డిమాండ్ చేసింది.

  కోడెల‌కు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు..

  స‌త్తెన‌ప‌ల్లి..న‌ర్స‌రావుపేట‌లో మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ వ్య‌తిరేక వ‌ర్గం వేగంగా పావులు క‌దుపుతోంది. అయిదేళ్ల కాలంలో ఎన్నో రకాలుగా వ‌సూళ్ల ప‌ర్వం కొన‌సాగించిన కోడెల కుటుంబం పైన గ‌డిచిన కొద్ది రోజుల్లో పెద్ద ఎత్తున ఫిర్యా దులు వ‌చ్చాయి. కోడెల కుమారుడు..కుమార్తె మీద కేసులు న‌మోద‌య్యాయి. దీంతో..వారు అరెస్ట్ నుండి త‌ప్పించుకోవ టానికి ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు సొంత పార్టీలో కోడెల వ్య‌తిరేక వ‌ర్గం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కోడెల‌ను స‌త్తెన‌ప‌ల్లి ఇన్‌ఛార్జ్ ప‌ద‌వి నుండి త‌ప్పించాల‌ని కోరుతూ పార్టీ అధినేత వ‌ద్ద‌కు చేరుకున్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యం ఎదుట ఆందోళ‌న‌కు దిగారు. కోడెల మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసారు. అయితే, వీరికి పార్టీ అధినేత చంద్ర‌బాబు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌టం ద్వారా పార్టీ సైతం కోడెల మీద చ‌ర్య‌లకు రంగం సిద్దం చేస్తుంద‌నే సంకేతాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

  Sattenapalli TDP leaders complaint against ex speaker Kodela Siva Prasad to Party Chief Chandra babu.

  ఓట‌మికి కోడెలే కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు..

  స‌త్తెన‌ప‌ల్లి..న‌ర్స‌రావుపేట‌ల్లో కోడెల కుటుంబం చేసిన అరాచ‌కాలే పార్టీని ఓడించాయ‌ని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం ఆరోపి స్తోంది. రాజ్యాంగబద్ధ పదవికి కలంకం తీసుకొచ్చారని సత్తెనపల్లి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మీదట నియోజ కవర్గ ఇన్‌చార్జిగా కోడెల కొనసాగితే పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశముందని బాహాటంగా చెబుతున్నారు. వీరు నేరుగా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆందోళ‌న‌కు దిగారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత జ‌రిగిన స‌మావేశంలో కొంద‌రు నేత‌లు పార్టీ అధినేత స‌మ‌క్షంలోనే కోడెల కుటుంబం చేసిన వ‌సూళ్లు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఓట‌మికి కీల‌క కార‌ణంగా చెప్పుకొచ్చారు. అదే స‌మావేశంలో ఉన్న కోడెల మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇక‌, ఇప్పుడు నేరుగా పార్టీ అధినేత వ‌ద్ద‌కే పంచాయితీ చేర‌టంతో.. ఇప్పుడు చంద్ర‌బాబు ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.  Source link

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here