కోలుకున్న మార్కెట్లు, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ, నష్టాల్లో ఆసియా మార్కెట్లు

0
2


కోలుకున్న మార్కెట్లు, లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ, నష్టాల్లో ఆసియా మార్కెట్లు

ముంబై: రెండు మూడు రోజులుగా భారీ నష్టాలను చవి చూస్తున్న షేర్ మార్కెట్లు మంగళవారం కాస్త కోలుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. పది గంటల సమయంలో సెన్సెక్స్ 208కు పైగా పాయింట్లు ఎగబాకి, 37,000 దగ్గర ట్రేడ్ అయింది. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 10,928 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70.67 వద్ద కొనసాగింది.

టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫినాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. జీ ఎంటర్టైన్‌మెంట్, యస్ బ్యాంకు, హిండాల్కో, టాటా స్టీల్, టైటాన్, HUL, RIL కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా అన్ని రంగాల షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం 7 పైసలు తగ్గింది. 70.80 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైనప్పటికీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండటంతో రూపాయి తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత బలపడింది. గత ఆరేళ్లలో ఒకేరోజు అత్యధికంగా రూపాయి గత సెషన్లో (ఆగస్ట్ 5) 113 పైసలు బలహీనపడి, 70.73 వద్ద క్లోజైంది.

అంతర్జాతీయ పరిణామాలు, వాణిజ్య భయాలు, మన ఈక్విటీ మార్కెట్ల నుంచి FPIల అవుట్ ఫ్లో, చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడం, కాశ్మీర్ అంశం వల్ల గత సెషన్లో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి గత మూడు సెషన్లలో కలిపి ఏకంగా 194 పైసల్ని కోల్పోయింది. అమెరికా – చైనా వాణిజ్య యుద్ధం, కాశ్మీర్ రాజకీయ అస్థిరత్వం రూపాయి 11 వారాల కనిష్ట స్థాయికి పడిపోయిందని చెబుతన్నారు.

మరోవైపు, అమెరికా – చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై, స్నెంజన్ దాదాపు 2 శాతం నష్టపోయాయి. జపాన్‌కు చెందిన నిక్కీ దాదాపు 1.5 శాతం మేర నష్టపోయింది. హాంగ్‌కాంగ్ హాంగ్ శంగ్ 2.3 శాతం, ఆస్ట్రేలియా బెంచ్‌మార్క్ ఎస్ అండ్ పీ ఏఎస్ఎక్స్ 200 కూడా 2 శాతం నష్టపోయింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here