కోహ్లీ ఆటకు వార్నర్‌ కూతురు ఫిదా.. ‘ఐయామ్‌ విరాట్‌ కోహ్లీ’ అంటూ జపం (వీడియో)!!

0
4


న్యూసౌత్‌వేల్స్‌: టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులే కాదు క్రికెట్ మాజీ ఆటగాళ్లు కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ కూతురు ఇవీమి కూడా చేరిపోయింది. స్టార్ ఆటగాడయిన తన తండ్రిని కాదని.. కోహ్లీ ఆటకు ఇవీమి ఫిదా అవ్వడం విశేషం.

షెఫాలీ, మంధాన రికార్డు భాగస్వామ్యం.. కామిని, పూనమ్ రికార్డ్ బ్రేక్‌!!

ఐయామ్‌ విరాట్‌ కోహ్లీ

డేవిడ్‌ వార్నర్‌ భార్య కాండైస్‌ వార్నర్‌ తాజాగా తన ట్విటర్‌ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో వార్నర్‌ కూతురు ఇవేమి బ్యాట్‌ పట్టుకుని బంతిని కొట్టే చేసే సమయంలో ‘ఐయామ్‌ విరాట్‌ కోహ్లీ’ అంటోంది. ప్రతి షాట్‌కు ఇవేమి ఇలానే అరుస్తుంది. సరదాగా క్రికెట్‌ ఆడే సమయంలో ఐయామ్‌ కోహ్లీ అంటూ ఉంటుందని కాండైస్‌ వెల్లడించారు. ‘చిన్నారి భారత్‌లో ఎక్కువ సమయం ఉండటంతో కోహ్లీలా ఉండాలనుకుంటుంది’ అని కాండైస్‌ వీడియోలో క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింలో వైరల్ అయింది.

'గో డాడీ

‘గో డాడీ

గత ఐపీఎల్‌లో వార్నర్ మరో కూతురు ‘ఇండి రే’ కూడా వార్తల్లో నిలిచింది. మైదానంలో వార్నర్‌ తన జట్టు సభ్యులతో మాట్లాడుతున్నపుడు ‘గో డాడీ’ అని ఉన్న ప్లకార్డు చూపిస్తూ ఇండి రే తండ్రిని ఎంకరేజ్ చేసింది. మైదానంలోని వార్నర్ ఇది చూసి చిరునవ్వులు చిందించాడు. వార్నర్‌తో పాటు రషీద్ ఖాన్, సందీప్ శర్మలు కూడా నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. ‘ఇలాంటి ఘటనలు ఐపీఎల్‌కే అందాన్ని తెస్తాయి’ అని ఓ కాప్షన్ పెట్టింది.

హైదరాబాద్‌ రోడ్లపై ఆటోలో షికారు

హైదరాబాద్‌ రోడ్లపై ఆటోలో షికారు

ఖాళీ సమయం దొరికితే వార్నర్ తన ఫ్యామిలీతో హాయిగా షికారు చేస్తాడు. ఐపీఎల్‌-12లో కొంచెం సమయం దొరకడంతో వార్నర్ తన పిల్లలతో కలిసి హైదరాబాద్ రోడ్లపై ఆటోలో చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సన్‌రైజర్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ షికారుకు ‘టుక్-టుక్ రైడ్’ అంటూ నామకరణం చేసింది.

 సంవత్సరం పాటు నిషేధం:

సంవత్సరం పాటు నిషేధం:

గత ఏడాది బాల్ ట్యాంపరింగ్ నేరానికి పాల్పడి సంవత్సరం పాటు నిషేధాన్ని ఎదురుకున్న వార్నర్.. ఐపీఎల్ 12వ సీజన్‌లో తన సత్తా చాటుకున్నాడు. అనంతరం ప్రపంచకప్, యాషెష్ సిరీస్‌లలో రాణించాడు. ఐపీఎల్‌లో వార్నర్‌ 126 మ్యాచ్‌ల్లో 4,706 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో విరాట్ 177 మ్యాచ్‌ల్లో 5,412 పరుగులు చేసి టాప్‌లో ఉండగా.. వార్నర్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

2019 ఐపీఎల్‌లో టాప్‌ ప్లేస్‌

2019 ఐపీఎల్‌లో టాప్‌ ప్లేస్‌

2014 నుంచి పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వార్నర్‌.. 2015 ఐపీఎల్‌లో 562 పరుగులతో అగ్రస్థానాన్ని సాధించాడు. 2016 ఐపీఎల్‌లో రెండో స్థానంలో, 2017లో మళ్లీ టాప్‌ ప్లేస్‌ను దక్కించున్నాడు. నిషేధం కారణంగా 2018 ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కాగా.. 2019లో మరలా అగ్రస్థానాన్ని సాధించాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here