కోహ్లీ డబుల్‌ సెంచరీ: పాంటింగ్ రికార్డు సమం.. బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు!!

0
4


హైదరాబాద్: పూణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ (254 నాటౌట్: 336 బంతుల్లో 33ఫోర్లు, 2సిక్సర్లు) సాధించాడు. డబుల్ సెంచరీతో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ ప్రపంచ రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ. టెస్టుల్లో టీమిండియా తరుపున 7 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్ మన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టెస్టు హోదా కలిగిన ఆరు దేశాలపై డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

ముగిసిన రెండో రోజు ఆట.. దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్.. స్కోర్ 36/3

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తొమ్మిది సార్లు 150కి పైగా స్కోర్ చేసి ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. బ్రాడ్‌మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు. కోహ్లీ వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై డబుల్ సెంచరీ చేసాడు. ఒక్క ఆస్ట్రేలియాపై మాత్రమే బాకీ ఉన్నాడు.

కోహ్లీ 7 డబుల్ సెంచరీలు చేయగా.. బ్రాడ్‌మన్ (12) డబుల్ సెంచరీతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (11), విండీస్ మాజీ కెప్టెన్ బ్రియానా లారా (9) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (7) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టెస్టుల్లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి కంటే ముందు ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. కోహ్లీ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్ (6996) పరుగుల రికార్డుని కూడా అధిగమించాడు.

తాజా సెంచరీ కోహ్లీకి టెస్టుల్లో 26వది. కెప్టెన్‌గా మాత్రం 19వ సెంచరీ. కెప్టెన్‌గా 19 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో అందరికంటే ముందున్నాడు. కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తే.. త్వరలోనే స్మిత్ రికార్డును కూడా బద్దలు కొట్టేటట్టు ఉన్నాడు.

శుక్రవారం ఆట ముగిసేసమయానికి తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 15 ఓవర్లో 3 వికెట్లకు 36 పరుగులు చేసింది. పేసర్ ఉమేశ్ యాదవ్ (2/16), మొహమ్మద్ షమీ (1/3) ఆరంభంలోనే విరుచుకుపడటంతో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్ (6), మార్‌క్రమ్ (0)లను ఉమేశ్ పెవిలియన్ పంపగా.. బావుమాను షమీ ఔట్ చేసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 33 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను డిబ్రుయిన్ (20), నోర్జె (2) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here