కోహ్లీ బాగా ప్రోత్సహించాడు: మనసులో మాటను బయటపెట్టిన అయ్యర్

0
0


హైదరాబాద్: జట్టులో ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నానని తన మనసులోని మాటను బయటపెట్టాడు యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆదివారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో శ్రేయస్ అయ్యర్ 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

బద్దలైన రికార్డులవే: సచిన్‌కి 7 సెంచరీల దూరంలో విరాట్ కోహ్లీ

కెప్టెన్ విరాట్ కోహ్లీ (125 బంతుల్లో 120; 14 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (68 బంతుల్లో 71; 5 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీ చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు.

ఓపెనర్లు రోహిత్‌ శర్మ(18), రిషబ్ పంత్‌(20) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో ఐదోస్థానంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్… విరాట్‌ కోహ్లీ(120)కి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. లక్ష్య చేధనలో 27 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న విండిస్ ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకే ఆలౌటైంది.

ఈ విజయంతో మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ “జట్టులో ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నా. నిలకడ ఎప్పటికీ కీలకమే. బాగా ఆడి జట్టుకు సాయపడాలని భావిస్తున్నా. రెండో వన్డే చక్కగా సాగింది. ఈ మ్యాచ్‌లో నేను బాగా ఆడతానని తెలుసు” అని అన్నాడు.

విండీస్ దిగ్గజం లారా రికార్డులు బద్దలు కొట్టిన క్రిస్ గేల్‌

“విండిస్-ఏ జట్టుతో జరిగిన అనధికార వన్డే సిరిస్‌లో సైతం మంచి ప్రదర్శన చేశాను. మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని కోహ్లీ చెప్పాడు. నన్ను బాగా ప్రోత్సహించాడు. మేమిద్దరం సింగిల్స్‌, డబుల్స్ తీశాం. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించాం. 250 మంచి స్కోరుగా భావించాం. 30 పరుగులు అదనంగా లభించాయి. కనీసం 45 ఓవర్ల వరకు ఆడాలని కోహ్లీ నాకు సూచించాడు” అని అయ్యర్‌ అన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here