కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు: ఆసీస్ తరుపున టీ20ల్లో వార్నర్‌ సరికొత్త రికార్డు

0
1


హైదరాబాద్: శ్రీలంక పర్యటనకు ముందు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరిస్‌లో డేవిడ్ వార్నర్ నిరాశపరిచాడు. ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 9.5 యావరేజితో 95 పరుగులు చేశాడు. యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కొనడంలో డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు.

సరిగ్గా నెల రోజుల తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు. మూడు టీ20ల సిరిస్‌లో మొత్తం 217 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఓ సరికొత్త రికార్డుని కూడా సృష్టించాడు.

స్మరించుకుందాం: ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తి

కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు

కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు

ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్‌ మన్రో పేరిట ఉన్న రికార్డుని డేవిడ్ వార్నర్ బద్దలు కొట్టాడు. ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా జరిగిన మూడు టీ20ల్లో కోహ్లీ, మున్రోలు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించారు. 2015-16 సీజన్‌లో ఆసీస్‌ పర్యటన సందర్భంగా కోహ్లీ వరుసగా 90 నాటౌట్‌, 59 నాటౌట్‌, 50 పరుగులు చేశాడు.

2017-18 సీజన్‌లో కొలిన్‌ మన్రో

2017-18 సీజన్‌లో కొలిన్‌ మన్రో

ఆ తర్వాత 2017-18 సీజన్‌లో కొలిన్‌ మన్రో విండీస్‌పై 53, 66, 104 పరుగులతో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో డేవిడ్ వార్నర్ నాటౌట్‌ నిలిచాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో వార్నర్(100 నాటౌట్)గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సిరిస్‌లో 217 పరుగులు సాధించిన వార్నర్

ఈ సిరిస్‌లో 217 పరుగులు సాధించిన వార్నర్

అనంతరం బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో(60 నాటౌట్), మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టీ20లో (57నాటౌట్) ఇలా మూడు టీ20ల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఈ సిరిస్‌లో వార్నర్ మొత్తం 217 పరుగులు సాధించాడు. వార్నర్ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

వంద సిక్సులు బాదిన రెండో ఆటగాడు

వంద సిక్సులు బాదిన రెండో ఆటగాడు

శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టీ20లో వార్నర్(57) హాఫ్ సెంచరీ సాధించడంతో టీ20ల్లో 900 పరుగులు చేసిన ఏకైక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు ఆస్ట్రేలియా తరుపున వంద సిక్సులు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అంతకముందు మాజీ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 105 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here