కౌన్సెలర్‌ పోస్టులను భర్తీ చేయాలి

0
1


కౌన్సెలర్‌ పోస్టులను భర్తీ చేయాలి

మాట్లాడుతున్న విద్యార్థి నాయకుడు భరత్‌

భిక్కనూరు, న్యూస్‌టుడే: జూనియర్‌ కళాశాలల్లో నియమించే కౌన్సెలర్‌ పోస్టులను సోషల్‌ వర్క్‌ విద్యార్థులచే భర్తీ చేయాలని విద్యార్థి నాయకుడు భరత్‌ డిమాండ్‌ చేశారు. ప్రాంగణం ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ కళాశాలల్లో కౌన్సిలర్‌ పోస్టులకు సోషల్‌ వర్క్‌ విద్యార్థులు పూర్తి న్యాయం చేస్తారని, క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపైన అవగాహన కలిగి ఉండేది ఒక్క ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులకు మాత్రమేనని తెలిపారు. సోషల్‌వర్క్‌ విద్యార్థి ఇతర విద్యార్థులకు చక్కగా మార్గదర్శకం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్ధి నాయకులు తరాజు, సుధాకర్‌, ప్రతాప్‌, వినోద్‌ పాల్గొన్నారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here