క్రికెట్ ఆడాలా లేదా అనేది నిర్ణయించుకోవావల్సిందే ధోనీయే: శాస్త్రి సంచనల వ్యాఖ్యలు

0
2


హైదరాబాద్: భారత జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అందుబాటుపై హెడ్ కోచ్ రవిశాస్త్రి తొలిసారి స్పందించాడు. తిరిగి క్రికెట్ ఆడాలా లేదా అనేది నిర్ణయించుకోవావల్సిందే ధోనీయేనని రవిశాస్త్రి పేర్కొన్నారు. వరల్డ్‌కప్ తర్వాత భారత ఆర్మీకి సేవ చేసేందుకు గాను ధోని క్రికెట్‌ నుంచి రెండు నెలలు పాటు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ విరామంలో ధోని తనంతట తానుగా వెస్టిండిస్, దక్షిణాప్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, సెప్టెంబర్ నెలలో స్వదేశంలో ప్రారంభమయ్యే బంగ్లా సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని వార్తలు వచ్చాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గురువారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అసలేం జరిగింది?: జహీర్ vs పాండ్యా, అహంకారం ప్రదర్శించకుండా మర్యాదగా వ్యవహరించు

రవిశాస్త్రి మాట్లాడుతూ

రవిశాస్త్రి మాట్లాడుతూ

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ ధోని మళ్లీ క్రికెట్ ఆడటం ఎప్పుడు ప్రారంభించాలనుకుంటున్నాడో నిర్ణయం తీసుకుంటే… అతని భవిష్యత్ ప్రణాళికల గురించి సెలెక్టర్లకు తెలియజేయాలని స్పష్టం చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ “ధోని తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే అది అతడే నిర్ణయించుకోవాలి. వరల్డ్‌కప్ తర్వాత నేను ధోనీని కలవలేదు” అని చెప్పాడు.

నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి

నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి

వరల్డ్‌కప్‌లో అయిన గాయం కారణంగా ధోని నవంబర్ వరకు సెలక్షన్ కమిటీకి అందుబాటులో ఉండడని చెప్పారు. 38 ఏళ్ల ధోని ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ వెన్నునొప్పి మాత్రం అతడిని గత కొంతకాలంగా బాధిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా ధోని ఆడటం లేదు.

ధోని ఆడటం నేను చూడలేదు

ధోని ఆడటం నేను చూడలేదు

“అతను మొదట ఆడటం ప్రారంభించాలి, ఆ తర్వాత విషయాలు ఎలా జరుగుతాయో చూద్దాం. వరల్డ్‌కప్ తర్వాత ధోని ఆడటం నేను చూడలేదు. అతడు గనుక ఆసక్తిగా ఉంటే, ఆ విషయాన్ని ఖచ్చితంగా సెలెక్టర్లకు తెలియజేస్తాడు. ధోని మా గొప్ప ఆటగాళ్ళ జాబితాలో ఒకడు” అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహా

పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహా

మరోవైపు తొలి టెస్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ స్థానంలో వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేయడంపై కూడా రవిశాస్త్రి ఈ సందర్భంగా స్పందించాడు. “సాహా గాయపడటం వల్లే టెస్టుల్లో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడు. బౌన్స్ అస్థిరమైన చోటు సాహా వికెట్ కీపింగ్ ఎంతో అమూల్యమైనది” అని శాస్త్రి తెలిపాడు.

1-0 ఆధిక్యంలో టీమిండియా

1-0 ఆధిక్యంలో టీమిండియా

“ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టుల్లో రిషబ్ పంత్ సెంచరీలు చేశాడు. అతడు కూడా టాలెండ్ ఆటగాడు. ప్రస్తుతానికి అతడు యువ ఆటగాడు, ఇంకా అతడి నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాల్సి ఉంది” అని రవిశాస్త్రి తెలిపాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here