క్రెడిట్ కార్డు కోసం కన్న బిడ్డలను అమ్మేసిన తల్లి.. కొత్త ఫోన్ కొని జల్సాలు!

0
4


క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు ఓ తల్లి తన కవల పిల్లలను అమ్మేసింది. బిల్లు చెల్లించిన తర్వాత మిగిలిన సొమ్ముతో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెజియాంగ్ రాష్ట్రంలోని సిక్సి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మా అనే మహిళకు కవల పిల్లలు పుట్టారు. వారిని పెంచడం ఆమెకు భారం అనిపించింది.

మా భర్త వూ జూదం ఆడుతూ భారీగానే అప్పులు చేశాడు. దీంతో ఆమె ఆ బిడ్డలను వేర్వేరు వ్యక్తులకు 65 వేల యువాన్ (రూ6,54,300)లకు అమ్మేసింది. ఒకరిని 45 వేల యువాన్(రూ.4,52,977)కు, మరొకరిని 20 వేల యువాన్(రూ.2,01,323)కు విక్రయించింది. ఆ డబ్బుతో ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించింది. మిగిలిన సొమ్ముతో కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది.

Read also: అప్పుడే పుట్టిన శిశువు తలను చిదిమేసి.. గార్డెన్‌లో పూడ్చిపెట్టిన చీర్‌గర్ల్

ఆమె భర్త వూకు ఆమె చేసిన పని కోపం తెప్పించింది. అయితే, ఆ కోపం పిల్లలను అమ్మేసినందుకు కాదు, ఆ డబ్బును తనతో పంచుకోనందుకు. జూదంలో బకాయిలను తీర్చేందుకు కొంత మొత్తం ఇవ్వాలని అతడు డిమాండ్ చేయగా ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు దంపతులిద్దరిని అరెస్టు చేశారు.

ఏడాది కిందట చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు ఇటీవలే బయటపెట్టారు. మా సెప్టెంబరులో కవలలు జన్మనిచ్చిందని, వారికి రెండు వారాల వయస్సు నిండకుండానే అమ్మేసిందని తెలిపారు. ఆ పిల్లలను కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలేవీ ఆమె తెలుసుకోలేదని, దీనివల్ల వారిని పట్టుకోవడం ఆలస్యమైందన్నారు. దీంతో రెండు బృందాలుగా విడిపోయి.. చైనా అంతటా గాలించగా పిల్లల ఆచూకీ లభించిందన్నారు.

Read also: జీపు నుంచి జారిపడిన పసిపాప.. అడవిలో చిమ్మచీకట్లో నరకయాతన!

చైనా చట్టాల ప్రకారం.. చిన్నారులను అక్రమంగా తరలించడాన్ని నేరం. దోషులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో పిల్లలను విక్రయించిన తల్లిదండ్రులతోపాటు, వారిని కొనుగోలుచేసిన వ్యక్తులకు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల ఆ కవలలను.. మా తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ దంపతులు ఇంకా పోలీసు కస్టడీలోనే ఉన్నారు. ఈ ఘటనపై కోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది.

Read also: మనిషి ముఖంతో పుట్టిన ఆవు దూడ.. కారణం ఇదే! (వీడియో)Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here