క్రెడిట్ కార్డ్ వద్దనుకుంటున్నారా… అయితే ఇలా చేయాల్సిందే….

0
1


క్రెడిట్ కార్డ్ వద్దనుకుంటున్నారా… అయితే ఇలా చేయాల్సిందే….

మొదటిసారి క్రెడిట్ కార్డ్ పొందడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. ఒక కార్డు వచ్చిన తర్వాత కస్టమర్ చెల్లింపుల చరిత్రను బట్టి మరిన్ని కంపెనీలు కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. మంచి క్రెడిట్ లిమిట్ ను కూడా ఇస్తుంటాయి. కొంత మంది కార్డ్ ఇస్తామనగానే తీసుకుంటారు. వీటి వినియోగంపై నియంత్రణ లేక తర్వాతి కాలంలో చెల్లింపుల విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. ఉద్యోగం చేసేవారు లిమిట్ చూసుకుంటూ పరిమితి దాటి ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది.

అయితే కొన్ని సార్లు అసలు మొత్తం చెల్లించలేక కనీస మొత్తం చెల్లించే పరిస్థితి వస్తుంది. కొన్ని సార్లు ఇది కూడా చెల్లించలేక జరిమానాలు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అప్పుడు తెలుస్తుంది క్రెడిట్ కార్డుల వల్ల ఉండే ఇబ్బందుల గురించి. అప్పుడు తేరుకొని కొన్ని కార్డులను వదిలించుకుంటే బాగుంటుందన్న నిర్ణయానికి వస్తారు. అయితే కొంతమంది ఆదరాబాదరాగా లేదా సమయం లేక పోవడంవల్ల క్రెడిట్ కార్డ్ ఖాతాను మూసివేయడంలో ఉన్న విధానాన్ని పట్టించుకోరు.

కార్డు రద్దయిందా లేదా అన్నది చూసుకుంటారు కానీ ఖాతా మూసివేత సమయంలో ఏమైనా బకాయి మొత్తం ఉన్నదా లేదా అన్నది చూసుకోరు. ఇలాంటివి ఉన్నప్పుడే ఇబ్బంది కలుగు తుంది. ఆ ఇబ్బంది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బ తీయడానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మీ క్రెడిట్ నివేదికపైనా మచ్చపడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే…

ఎప్పుడు రద్దు చేసుకోవాలంటే..

* ఒకటికి మించి క్రెడిట్ కార్డులున్నప్పుడు అన్నింటినీ వినియోగించుకునే అవకాశం ఉండదు.

* కొన్ని అలా పర్సులో అలంకరణగానే ఉండిపోతాయి. అయినప్పటికీ వీటికి వార్షిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్నింటిపై ఎక్కువ వడ్డీ ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఏదైతే అవసరం లేదనుకుంటారో దాన్ని ఎంచుకొని రద్దు చేసుకోవాలి.

* ఎక్కువ వాడకుండా ఉన్నది లేదా ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నదాన్ని రద్దుచేసుకుంటే మంచిది. ఎక్కువ కాలంగా వినియోగిస్తున్న కార్డును రద్దు చేసుకోవద్దు. ఇలాంటివి మీ క్రెడిట్ చరిత్ర తెలియజేయడానికి, భవిష్యత్ లో రుణాలను సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.

బకాయిలు ఉంచవద్దు…

* మీరు క్రెడిట్ కార్డును రద్దు చేసుకునే ముందు మీరు చెల్లించాల్సి ఉన్న మొత్తాన్ని సెటిల్ చేయమని మీ బ్యాంకు కోరుతుంది. మీరు కాదు రద్దు కోసం దరఖాస్తు చేయడానికి ముందే బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది.

* కార్డును రద్దు చేసుకోవడానికి ముందు మీ కార్డు వినియోగం ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్లను వినియోగించుకోండి. లేకపోతే అవి నిరుపయోగం అవుతాయి.

* కార్డు రద్దు కోసం కస్టమర్ సర్వీస్ విభాగాన్ని సంప్రదించండి. కార్డు రద్దు సమయంలో మీకు కార్డు వివరాలు, తాజా స్టేట్ మెంట్ లోని వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకని వీటిని వెంట ఉంచుకోవాలి.

* మీ బ్యాంకు ఫోన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకొని కూడా క్రెడిట్ కార్డు ను రద్దు చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా కూడా కార్డు రద్దుకు సంబంధించిన అభ్యర్థన చేయవచ్చు. ఇందుకు మీ రిజిస్టర్డ్ ఐడీ, మీ పేరు, చిరునామాతోపాటు మీ కార్డు చివరి నాలుగు అంకెలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కార్డు రద్దుకు సంబంధించిన వివరాలను బ్యాంకు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి.

నో డ్యూ సెర్టిఫికెట్ తీసుకోండి

* క్రెడిట్ కార్డు ఖాతా ముగించుకున్న తర్వాత మీ బ్యాంకు నుంచి నో డ్యూ సెర్టిఫికెట్ ను పొందండి. దీనివల్ల భవిష్యత్తులో బకాయిలకు సంబంధించి మీకు, మీ బ్యాంకుకు మధ్య ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

క్రెడిట్ నివేదిక

* క్రెడిట్ కార్డు రద్దు చేసుకున్న తర్వాత ఒకసారి మీ క్రెడిట్ రిపోర్ట్ కూడా చూసుకోండి. క్రెడిట్ కార్డు రద్దు చేసిన వివరాలు ఉన్నాయా లేదా పరిశీలించండి. లేకపోతే మీ బ్యాంకుకు తెలియజేయండి. కార్డు రద్దు వివరాలు అప్డేట్ చేసుకోవడం ద్వారా భవిష్యత్లో రుణాలు తీసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here