క్రేజీ కాంబో: హీరోగా డైరెక్టర్‌.. విలన్‌గా హీరో

0
0


మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్‌. టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ దర్శకుడు, కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో వినాయక్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. ఇటీవల వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ ముందు బోల్తా పడ్డాయి.

దీంతో డైరెక్షన్‌కు బ్రేక్‌ ఇచ్చిన వినాయక్‌ నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గతంలో ఠాగూర్‌, ఖైదీ నంబర్‌ 150 సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన వినాయక్‌ తాజా ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మాతగా శంకర్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శీనయ్య అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.
Also Read: బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ప్రొమో.. కలర్‌ఫుల్‌.. మెగాస్టార్‌ మిస్‌!

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో వినాయక్‌కు ప్రతినాయకుడిగా టాలీవుడ్‌ యంగ్ హీరో నటించనున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత విలన్‌గా, సపొర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటున్న నవీన్‌ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు.
Also Read: మోదీ సెక్యూరిటీ మా ఫోన్లు లాగేసుకున్నారు: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

వినాయక్‌ మెకానిక్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ సినిమా తరహా యాక్షన్‌, బిల్డప్‌ సీన్స్‌ పెద్దగా ఉండవని తెలుస్తోంది. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినాయక్‌ నటుడిగా అందరినీ మెప్పిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.
Also Read: బన్నీకి విలన్‌గా కోలీవుడ్‌ హీరో.. రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here