క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తితో ప్ర‌ధాని మోడీ భేటీ! కార‌ణం.. గురుపూర్ణిమేనా?

0
0


క‌ర్ణాట‌క మ‌ఠాధిప‌తితో ప్ర‌ధాని మోడీ భేటీ! కార‌ణం.. గురుపూర్ణిమేనా?

న్యూఢిల్లీ: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం క‌ర్ణాట‌క‌లోని ఉడుపికి చెందిన పెజావ‌ర మ‌ఠాధిప‌తి శ్రీ విశ్వేశతీర్థ స్వామిజీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయ‌న స్వామిజీతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయ‌న ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. గురు పూర్ణిమ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా తాను పెజావ‌ర మ‌ఠాధిపతితో భేటీ కావ‌డం ఆనందంగా ఉంద‌ని మోడీ పేర్కొన్నారు.

స్వామిజీ ఆశీర్వాదాన్ని తీసుకున్నాన‌ని అన్నారు. ఆయ‌న నుంచి చాలా నేర్చుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. స్వామిజీతో క‌లిసి దిగిన ఫొటోల‌ను న‌రేంద్ర మోడీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ ఇద్ద‌రి మ‌ధ్య క‌ర్ణాట‌కలో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభానికి సంబంధించిన అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే ఉంటాయ‌ని అంటున్నారు. పెజావ‌ర మ‌ఠాధిప‌తికి రాజ‌కీయ నాయ‌కుల‌తో స‌త్సంబంధాలు ఉండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని ఉద‌హ‌రిస్తున్నారు.

ప్ర‌త్యేకించి- భార‌తీయ జ‌న‌తాపార్టీ క‌ర్ణాట‌క శాఖ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప త‌ర‌చూ శ్రీవిశ్వేశ‌తీర్థ స్వామిజీని క‌లుస్తుంటారు. ఆయ‌న ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో- కొద్దో, గొప్పో.. క‌ర్ణాట‌క రాజ‌కీయాంశాల‌పై చ‌ర్చించి ఉండే అవ‌కాశాలు లేక‌పోలేదు.

PM Narendra Modi has met Sri Vishvesha Teertha Swamiji of the Sri Pejawara Matha on the occasion of Guru PurnimaSource link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here